బ్యాక్ టు బ్యాక్ హిట్లతో అనిల్ రావిపూడి మంచి ఫామ్ లో ఉన్నాడు. మనోడు డైరెక్ట్ చేస్తానంటే చాలా అగ్ర నిర్మాణ సంస్థలు బ్లాంక్ చెక్ లు పట్టుకుని సినిమాలు తీయడానికి రెడీ అయిపోతున్నాయి. ఇప్పటికే పలు అగ్ర నిర్మాణ సంస్థలతో అనిల్ రావిపూడికి అగ్రీమెంట్స్ ఉన్నాయి. దిల్ రాజు బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తో ఉన్న అనిల్ కి ఉన్న డీల్ ప్రకారం ఎఫ్ 3 సినిమాను డైరెక్ట్ చేయాలి. దీంతో అనిల్ ఈ ప్రాజెక్ట్ ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి ఆ బ్యానర్ నుంచి బయటకు రావడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే ఎఫ్ 3 కి కావాల్సిన కథ మొత్తం రెడీ చేసేశాడు. నిజానికి ఈ సినిమా షూటింగ్ మార్చిలోనే మొదలవ్వాలి కానీ కరోనా కారణంగా నిలిచిపోయింది.
ప్రస్తుతం కేంద్రం కూడా సినిమాల షూటింగ్స్ కి అనుమతి ఇవ్వడంతో ఒక్కో చిత్ర బృందం మెల్లిగా సినిమా నిర్మాణ పనుల్లోకి దిగుతున్నాయి. ఇదే రీతిన ఎఫ్ 3 షూటింగ్ ని కూడా స్టార్ట్ చేయడానికి అనిల్ ప్లాన్ చేసుకున్నాడు. అయితే తాజాగా హీరో విక్టరీ వెంకటేశ్ తాను ఈ ఏడాది మొత్తం ఎలాంటి సినిమాలు చేయను అని స్పష్టం చేయడంలో ఎఫ్ 3 విషయంలో అనిల్ వేసుకున్న ప్లాన్స్ మొత్తం కూలిపోయాయి. దీంతో ప్రస్తుతం అనిల్ అటు బయట సినిమాలు చేయలేక , ఇటు ఎఫ్ 3 ని త్వరగా ముగించి ఎస్వీస్ బ్యానర్ నుంచి బయటకు రాలేక తెగ ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు అని తెలిసింది. ఏం జరుగుతుందో చూడాలి.











