2021 స్టార్ హీరోల అభిమానులకు పండగే. తమ అభిమానుల కోసం తాము నటిస్తున్న సినిమాల పోస్టర్ లను ఆయా హీరోలు విడుదల చేశారు. ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ‘రాధేశ్యామ్’ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఇందులో ప్రభాస్ ఓ పర్వతంపై కూర్చుని ఉన్నాడు. ఈ ఫొటో ప్రభాస్ అభిమానులకు పండగ చేసేసింది.
దర్శకుడు రాధాకృష్ణ పాన్ ఇండియా సినిమాగా దీన్ని రూపొందిస్తున్నారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలిపారు. హమ్ ఆప్ కే హై కౌన్ నటి భాగ్యశ్రీ కూడా ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తోంది. దాదాపు ఐదు భాషల్లో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా ఈ సినిమా నిర్మాణం చేపట్టారు.
Also Read: ప్రభాస్.. మరో పాన్ ఇండియా మూవీ. ఇంతకీ ఎవరితో.?
He has arrived to win your hearts & make you fall in love all over again! 💕
Here's wishing you all a Happy New Year! #2021WithRadheShyamStarring #Prabhas & @hegdepooja pic.twitter.com/1GiHl6KFTm
— UV Creations (@UV_Creations) December 31, 2020











