పాన్ ఇండియా హీరో ప్రభాస్.. ప్రస్తుతం రాథేశ్యామ్ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇందులో రెబల్ స్టార్ కృష్ణంరాజు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా 2021 సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇక జనవరి నుంచి ‘సలార్’ మూవీని గ్రాండ్ గా స్టార్ట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమాకి కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్వకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా ఫాస్ట్ గా జరుగుతోంది.

పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ సినిమాని కూడా 2021లోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అభిమానులు ప్రభాస్ ని ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించబోతున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే 2021 దసరాకి సలార్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు సినిమాలతో పాటు ప్రభాస్ పాన్ ఇండియా మూవీస్ ఆదిపురుష్, నాగ్ అశ్విన్ తో ఓ మూవీ చేయనున్నారు. ఆదిపురుష్ మూవీ వచ్చే సంవత్సరమే సెట్స్ పైకి వెళ్లనుంది. ఇదిలా ఉంటే.. ప్రభాస్ మరో పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.
ఇంతకీ ఎవరితో అంటే.. ప్రముఖ టాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో అని సమాచారం. ఎప్పటి నుంచో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రభాస్ తో సినిమా చేయాలనుకుంటోంది. అయితే.. ఇప్పటి వరకు కమిట్ అయిన సినిమాలు పూర్తైన తర్వాత మీ బ్యానర్ లోనే సినిమా చేస్తానని ప్రబాస్ మాట ఇచ్చారట. మైత్రీ సంస్థ తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్ పేరు చెబితే.. ఇతనితో పాటు బాలీవుడ్ డైరెక్టర్ ని కూడా చూడమని చెప్పారట. డైరెక్టర్ సెట్ అయితే.. మరో పాన్ ఇండియా మూవీ కన్ ఫర్మ్ అయినట్టే. మరి.. ప్రభాస్ ని డైరెక్ట్ చేసే లక్కీ ఛాన్స్ ఎవరు దక్కించుకుంటారో చూడాలి.
Must Read ;- పాన్ ఇండియా మూవీ ప్లానింగ్ లో కృష్ణవంశీ…!











