బ్యాడ్మింటన్ స్టార్ గుత్తాజ్వాల, తమిళ హీరో విష్ణువిశాల్ ఓ ఇంటి వారు కాబోతున్నట్టే.
బ్యాడ్మింటన్ స్టార్ గుత్తాజ్వాల, తమిళ హీరో విష్ణువిశాల్ ఓ ఇంటి వారు కాబోతున్నారండోయ్. వీరి నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. నాకు నువ్వు నీకు నేను అన్నట్లుగా ట్విట్టర్ లో పోస్టులు కూడా పెట్టేశారు. వీరిద్దరి మధ్యా ప్రేమ జ్వాలలు ఎగిసినట్లు బాగా ప్రచారంలో ఉంది. కరోనా సమయంలో కూడా గుత్తాజ్వాల ప్రభుత్వ అనుమతి తీసుకుని మరీ విష్ణు విశాల్ ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఎక్కడ కనెక్టయిందబ్బా అనే శోధన నెటిజన్లలో ఎక్కువైంది. తాను విష్ణువిశాల్ ను పెళ్లిచేసుకోబోతున్నట్లు గుత్తాజ్వాల తన ట్విట్టర్ అకౌంటు ద్వారా తెలిపింది.
దానికి విష్ణు కామెంట్ పెడుతూ ‘హ్యాపీ బర్త్‌డే గుత్తా జ్వాల. కొత్త ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. మంచి భవిష్యత్ కోసం, ఆర్యన్ కోసం, మన కుటుంబాల కోసం, మన స్నేహితుల కోసం పాజిటివ్‌గా ఉందాం. మీ అందరి ఆశీస్సులు కావాలి. అర్ధరాత్రి ఉంగరాన్ని ఎరేంజ్ చేసిన బసంత్ జైన్‌కి థ్యాంక్యూ’ అని పేర్కొన్నాడు. అలా వీరిద్దరి నిశ్చితార్థం కూడా రాత్రే జరిగిపోయిందన్నమాట. ఆమె పుట్టినరోజు సందర్భంగా విష్ణు విశాల్ హైదరాబాద్ కు వచ్చాడు.
ఈ సందర్భంగానే ఆమె వేలికి ఉంగరం తొడిగాడట. ఆ ఉంగరాన్ని కూడా గుత్తాజ్వాల పోస్టు చేసింది. తాను విష్ణుకు దూరంగా ఉండలేకపోతున్నానని ఆమె కరోనా లాక్ డౌన్ సమయంలో తన ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. ‘ఫర్లేదు సామాజిక దూరం ముఖ్యం’ అంటూ విష్ణు ఆమెను కూల్ చేశాడు. హీరో విష్ణు విశాల్ కు ఇంతకుముందే పెళ్లయ్యింది. భార్యతో విభేదాలు వచ్చి విడిపోయారు. అతనికి నాలుగేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు.
ఆమె సంగతి కూడా అంతే. తను మరో బ్యాడ్మింటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్ ను పెళ్లిచేసుకుంది. ఇద్దరి మధ్యా తేడాలొచ్చి విడిపోయారు. తాజాగా నిశ్చితార్థం వార్త హాట్ టాపిక్ గా మారింది. గుత్తా జ్వాల మహారాష్ట్రలోని వార్ధాలో పుట్టింది. ఆమె తండ్రి తెలుగువాడే. పేరు సుబ్రహ్మణ్యం. గుంటూరు జిల్లాలోని గుత్తావారి పాలెం సొంతూరు. తల్లి ఎలెన్ ది మాత్రం చైనా. ఆమె తాత మహాత్మాగాంధీ శిష్యుడు కావడంతో వారు వార్థాలో సెటిలయ్యారు. తల్లిదండ్రులిద్దరిదీ ప్రేమ వివాహమే.
Badminton star @Guttajwala and longtime boyfriend actor @TheVishnuVishal got engaged in a midnight ceremony on Jwala's birthday last night! #JwalaGutta #VishnuVishal pic.twitter.com/3ssrLJ1MnR
— Ahmedabad Times (@AhmedabadTimes) September 7, 2020











