జనసైనికుల ధర్మాగ్రహం ఎఫెక్ట్ బిగ్‌బాస్ సీజన్ 4 మీద కూడా పడుతోంది. అత్యంత పాపులర్ అయిన ఈ టీవీ షో ఆదివారం సాయంత్రమే మొదలైంది. టీవీ9 యాంకర్ దేవి నాగవల్లి కూడా కంటెస్టెంట్లలో ఒకరు. టీవీ9 మీద జనసైనికుల ఆగ్రహం పడుతోంది. ఆమెను ఎలిమినేట్ చేయాలంటూ.. సోషల్ మీడియా వేదికల మీద జనసైనికుల పెద్దసంఖ్యలో డిమాండ్ చేస్తున్నారు.
టీవీ9కు జనసైనికులకు మధ్య ఆన్‌లైన్‌లో సోషల్ మీడియా యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ టీవీ9 మీద ఆగ్రహించడం, వారి పార్టీ తరఫున లేఖ వెళ్లడం, టీవీ9 సంజాయిషీ ఇవ్వడం ఇవన్నీ పాఠకులకు తెలుసు. అదే సమయంలో.. జనసైనికులు #shamelesstv9 పేరుతో హ్యాష్ ట్యాగ్ వైరల్ చేస్తున్నారు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ నుంచి దేవి నాగవల్లిని ఎలిమినేట్ చేయాలని కూడా వాళ్లు డిమాండ్ చేస్తున్నారు.
#shamelesstv9 అనేది ఇప్పుడు ట్విటర్ లో ట్రెండింగ్ అయింది. ఇదే హ్యాష్ ట్యాగ్ తో దాదాపు రెండు లక్షల ట్వీట్లు పడ్డాయి. టీవీ9 ఏదో పవన్ కల్యాణ్ ని కెలికితే కాస్త రేటింగ్ వస్తుందని ఆరాటపడ్డట్టుందిగానీ.. అంతకు మించి పరువు పోగొట్టుకున్నమాట వాస్తవం. జనసైనికులు డిమాండ్ బిగ్ బాస్ షో మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుందేమో చూడాలి.