ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో వస్తున్న మూడో సినిమా ‘పుష్ప’. పాన్ ఇండియా లెవెల్లో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా కి ఆగస్ట్ 13న రిలీజ్ డేట్ లాక్ చేశారు. అయితే కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో సినిమా విడుదలను వాయిదా వేశారు మేకర్స్. అయితే ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలని సుకుమార్ నిర్ణయించుకున్నాడట.
నిజానికి ఎప్పటి నుంచో మేకర్స్ కు ఈ ఆలోచన ఉందట. పుష్ప కథలో రెండు భాగాలకు కావల్సిన స్టఫ్ ఉందని.. దీని గురించి బన్నీకి, సుక్కుకి మధ్య డిస్కషన్స్ కూడా నడిచాయని తెలుస్తోంది. ఆ మేరకు కథని రెండు పార్ట్స్ గా డివైడ్ చేసి సుక్కు టీమ్ బన్నీకి వివరించారట. ఇక బన్నీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. దాంతో ‘పుష్ప’రాజ్ గా బన్నీ రెండు పార్ట్స్ గా వస్తాడని అంటున్నారు.
పుష్ప మొదటి భాగానికి సరిపడా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ కాగా.. మరో 15 రోజుల షెడ్యూల్ లో మిగతా భాగం కూడా పూర్తవుతుందట. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ నిలిచిపోగా.. ఫస్ట్ పార్ట్ కు సంబంధించి రఫ్ కట్ చేస్తున్నారట. ఇదే కానీ నిజమైతే.. ‘బాహుబలి, కేజీఎఫ్’ తర్వాత రెండు భాగాలు వచ్చే పాన్ ఇండియా సినిమా పుష్పే అవుతుంది. ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ ఇచ్చి.. సెకండ్ పార్ట్ మీద ఆసక్తిని కలగజేస్తాడట సుక్కు. ఇక మొదటి భాగాన్ని దసరా కానుకగానూ, రెండో భాగాన్ని వచ్చే ఏడాది విడుదలయ్యేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మరి నిజంగానే పుష్ప రెండు భాగాలుగా వస్తాడేమో చూడాలి.











