దేశంలో కరోనా విరుచుకుపడుతుందే.. తప్పా తగ్గడం లేదు. లాక్ డౌన్ విధించినా.. కఠిన ఆంక్షలు అమలు చేస్తూన్నా మరణాల రేటు పైపైకి వెళ్తోంది. పాజిటివ్ కేసులు తగ్గినా.. మరణాలు ఆగడం లేదు. తాజాగా కరోనా మరణాలు మూడు లక్షలకు చేరాయి. గత 24 గంటల్లో దేశంలో 21,23,782 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 2,40,842 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. భారత్‌లో ఇప్పటివరకు 32,86,07,937 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, ప్రస్తుతం 28,05,399 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే ఏపీలో ఇప్పటివరకు అధికారిక లెక్కల ప్రకారం 10 వేలకుపైగా మరణాలు జరిగాయి. తెలంగాణలో లాక్ డౌన్ మంచి ఫలితాలు ఇస్తుండటంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. అనవసరంగా బయటకువస్తే వాహనాలు సీజ్ చేసి కేసులునమోదు చేస్తున్నారు.
ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..
ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్ కండిషన్ సౌకర్యం ఉంటే.....











