జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న తన తండ్రి జడ్జి రామకృష్ణకు చిత్తూరు జైలులో ప్రాణహాని ఉందని ఆయన తనయుడు వంశీకృష్ణ హైకోర్టుకు,జైళ్ల శాఖ ఐజీలకు లేఖ రాశారు.చిత్తూరు జైలులో జడ్జి రామకృష్ణ ఉన్న బ్యారెక్‌లోకి అపరిచితులను పంపుతున్నారని,వారు తన నాన్నను బెదిరిస్తున్నారని వంశీకృష్ణ లేఖలో పేర్కొన్నారు.సీఎం జగన్మోహన్‌రెడ్డిని,మంత్రి పెద్దిరెడ్డిని ఎదురించే మొనగాడివా అంటూ తన తండ్రిని చంపేస్తామని బెదరిస్తున్నారని,వంశీకృష్ణ హైకోర్టుకు రాసిన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న తన తండ్రి రామకృష్ణను,అపరిచిత వ్యక్తిని వేరువేరు బ్యారెక్లలో ఉంచేలా ఆదేశించాలని హైకోర్టుకు రాసిన లేఖలో విజ్ఙప్తి చేశారు.
నాన్ బెయిలబుల్ కేసులు
జడ్జి రామకృష్ణపై 124 ఏ సెక్షన్ల కింద రాజద్రోహం కేసు నమోదైన సంగతి తెలిసిందే.రెండు నెలలుగా జడ్జి రామకృష్ణ బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు.వచ్చే నెల 3వ తేదీన హైకోర్టులో బెయిల్ కేసు విచారణకు రానుంది.అయితే ఈ లోపే తన తండ్రిని అంతమొందించాలని ప్రయత్నిస్తున్నారని జడ్జి రామకృష్ణ తనయుడు వంశీకృష్ణ హైకోర్టుకు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.











