January 17, 2026 1:05 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

తెలుగు సినిమాకి మకుటం లేని మహా‘రాజు’

మానవత్వం, మనిషి తత్త్వం మూర్తీభవించిన మహనీయ వ్యక్తులు సినిమా రంగంలో అరుదు. అలాంటి వ్యక్తులు ఉంటే వారు స్ఫూర్తి ప్రదాతలుగా మిగిలిపోతారు.

December 12, 2023 at 11:21 PM
in Cinema, Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

చదువు, సంస్కారంతో పాటు సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తికి అలాంటి వ్యక్తేతోడైతే ఆ అనుబంధంతో చిరస్మరణీయమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టవచ్చు.అలాంటి మహనీయులే పద్మశ్రీ ఎన్ .టి. రామారావు, పద్మశ్రీ డి.వి.ఎస్. రాజు.

ఎన్టీ రామారావు గారికి ఆత్మీయ సోదరుడిగా డివిఎస్ రాజు గారు తారసపడ్డారు. నిర్మాతగా, లితో ప్రెస్ అధినేతగా, సమాజ సేవకుడిగా, మంచి పాలనా దక్షుడిగా డివిఎస్ రాజుగారికి పేరు. తెలుగు సినిమా రంగంలో అంచెలంచెలుగా ఎదిగి ఆ రంగాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన వారిలో డివిఎస్ రాజు ముందు ఉంటారు.డివిఎస్ రాజు 96వ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనమిది.

1952 ఎన్టీఆర్ నేషనల్ ఆర్ట్స్ అనే నిర్మాణ సంస్థ ను ప్రారంభించి టి. ప్రకాశ రావు దర్శకత్వంలో ‘పిచ్చి పుల్లయ్య’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్న సమయమది. ఆ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు సంగీత దర్శకుడు, ఎన్టీఆర్ రూమ్మేట్ టి.వి. రాజు సినీ లితో ప్రింటింగ్ ప్రెస్ అధినేత డి.వి.ఎస్. రాజును రామారావు గారికి పరిచయం చేశారు. ఆ వేళావిశేషమేమో వారిద్దరి మధ్య తెలియని అనుబంధం, ఆత్మీయత పెనవేసుకుపోయాయి.

ఎన్టీఆర్ కు తమ్ముడు త్రివిక్రమరావు అంటే అమితమైన వల్లమాలిన ప్రేమ. డివిఎస్ రాజును కూడా ఎన్టీఆర్ స్వంత తమ్ముడిలా అభిమానించి ఆదరించారు. ఆ సినిమా తర్వాత ఇంకో సినిమా చేసే సమయంలో తన తమ్ముడితో రాజుకు కబురు పంపారు. తాము నిర్మించే రెండో సినిమాలో నిర్మాణ భాగస్వామిగా చేర్చుకున్నారు. అలాంటి అవకాశం, అదృష్టం వస్తుందని డీవీఎస్ రాజు ఊహించలేదు. అలా నిర్మించిందే ‘తోడు దొంగలు’ సినిమా. అదే సమయంలో రాయలసీమలో కరవు విలయతాండవం చేస్తోంది.

అక్కడి ప్రజలు ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రముఖ జర్నలిస్టు నార్ల వెంకటేశ్వర రావు సలహాతో ఎన్టీఆర్ ప్రజలను ఆదుకోవాలనుకున్నారు.’ఆంధ్రప్రభ – రాయలసీమ కరవు నివారణ నిధి’ పేరుతో సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన తమ్ముడు త్రివిక్రమరావు, డివిఎస్ రాజు సహకారంతో విరాళాలు సేకరించి ప్రజలకు అందించారు.

అప్పటినుంచి ఎన్టీఆర్ ఏది తలపెట్టినా డివిఎస్ ఆయనను వెన్నంటే ఉండేవారు. ఆ తరువాత స్వంత నిర్మాణ సంస్థను ప్రారంభించమని, తాము అండగా ఉంటామని రామారావు హామీ ఇచ్చారు. ఇది కూడా డివిఎస్ ఊహించలేదు.1964లో డివిఎస్ ప్రొడక్షన్స్ సంస్థను రామారావే స్వయంగా ప్రారంభించడంతో పాటు తొలి సినిమాలో కథానాయకుడిగా నటించారు. అలా నిర్మించిన మంగమ్మశపథం సూపర్ డూపర్ హిట్ అయ్యింది.

డివిఎస్ వ్యక్తిత్వం సినిమా రంగంలోని పెద్దలను ఆకట్టుకుంది. ఆయన నిజాయితీ, నిబద్దత, నిరాడంబర త, నిరుపమానమైన సేవా గుణం అనేక సంస్థలలో ఆయనను భాగస్వామిని చేశాయి. తెలుగు నిర్మాతల మండలి, తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్య మండలి, ఆంధ్ర ప్రదేశ్ చలన చిత్ర అభివృద్ధి సంస్థ, జాతీయ చలన చిత్ర అభివృద్ధి సంస్థ, ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్, ఫిలిం నగర్ సహకార గృహ నిర్మాణ సంస్థలు నేటికీ విజయవంతంగా కొనసాగుతున్నాయంటే అది డివిఎస్ సమర్ధత, పటిష్టమైన ప్రణాళికతో వేసిన బీజాలే.

1982లో డివిఎస్ జాతీయ చలన చిత్ర అభివృద్ధి సంస్థకు చైర్మన్ గా ఉన్నారు. రిచర్డ్ అటెన్‌బరో దర్శకత్వంలో మహాత్మా గాంధీ జీవితం ఆధారంగా గాంధీ సినిమాని తెరకెక్కించారు. దీన్ని మన దేశంతో పాటు బ్రిటన్ కూడా కలిసి నిర్మించారు. ఈ చిత్ర లాభాల్లో కొంత భాగం భారతీయ సినిమా కార్మికుల కోసం ఇవ్వాలని డివిఎస్ పట్టుపట్టి మరీ సాధించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డివిఎస్, రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థకు ఛైర్మన్ గా వున్నారు.

అప్పుడు డివిఎస్ ఆధ్వర్యంలో నే తెలుగు లలిత కళా తోరణం రూపుదిద్దుకుంది. ఫిల్మోత్సవ్ ’86ను అత్యంత సమర్ధంగా అనితర సాధ్యంగా లలిత కళాతోరణంలోనే నిర్వహించారు. ఈ చిత్రోత్సవంలో అశోక్ కుమార్, రాజ్ కపూర్, ఎమ్ .జి . రామ చంద్రన్, కన్నడ రాజ్ కుమార్, ప్రేమ్ నజీర్ లాంటి హేమాహేమీలైన హీరోలు పాల్గొన్నారు. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా భారతీయ సినిమా ప్రగతికి తోడ్పడిన వ్యక్తి డివిఎస్ రాజు. ఆయన సేవలను గుర్తించిన అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 1988లో రఘుపతి వెంకయ్య అవార్డుతో ఆయనను సత్కరించారు.1995లో దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమ డి.వి.ఎస్.రాజు ను “సినీ భీష్మ ” అవార్డుతో ఘనంగా సత్కరించింది .

2001లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. అప్పటి రాష్ట్రపతి కె .ఆర్. నారాయణన్ పద్మశ్రీ అవార్డు ను డివిఎస్ రాజుకు ప్రదానం చేశారు. 1928 డిసెంబర్ 13న తూర్పు గోదావరి జిల్లా అల్లవరం లో జన్మిచిన డి.వి.ఎస్. రాజు తన జీవన ప్రస్థానంలో చెరిగిపోని కీర్తిని సంపాదించి 2010 నవంబర్ 13న హైదరాబాద్ లో ఇహలోక యాత్ర ముగించారు . అలా డి.వి.ఎస్. రాజు తన జన్మను సార్థకం చేసుకుని చరితార్థుడయ్యారు.

Tags: dvs rajuleotopspecial story of dvs raju
Previous Post

అంగన్వాడీల మెరుపు సమ్మె..!

Next Post

బీహార్‌ని మించిపోయిన ఏపీ.. ఇదే జగన్ మార్క్..! నిరుద్యోగంలో నెంబర్‌ వన్‌..!!

Related Posts

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

బబుల్ గమ్ మూవీ రివ్యూ

by లియో డెస్క్
December 29, 2023 4:48 pm

రాజీవ్ కనకాల, సుమ కనకాల దంపతుల పుత్రుడు రోషన్ కనకాల హీరోగా తెరంగేట్రం...

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

by లియో డెస్క్
December 25, 2023 6:56 pm

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ సృష్టించిన ప్రభంజనం మామూలుగా లేదు. అసలు ఈ సినిమా...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఏపీకి లక్ష కోట్లు.. కేంద్రం సంక్రాంతి కానుక..!

సంక్రాంతి సంబరాలు.. ఏపీ టూరిజానికి భారీ బూస్ట్‌..!

ప్రభల తీర్థానికి రాష్ట్ర పండుగ హోదా..ఘనంగా ఏర్పాట్లు..

తెలంగాణలో టీడీపీ పునర్‌ నిర్మాణం.. ముహూర్తం ఫిక్స్ చేసిన బాబు..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

‘కరుణామయుడు’ వెనక ఎంతపెద్ద ‘షో’ నడిచిందో?

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

ఇద్దరూ గాంధేయవాదులే.. దీక్షతో సాధించారు..

చీఫ్ జాబ్ క్రియేటర్ గా లోకేష్..

Malavika Mohanan Hot pics

ముఖ్య కథనాలు

ప్రభల తీర్థానికి రాష్ట్ర పండుగ హోదా..ఘనంగా ఏర్పాట్లు..

సంక్రాంతి సంబరాలు.. ఏపీ టూరిజానికి భారీ బూస్ట్‌..!

తెలంగాణలో టీడీపీ పునర్‌ నిర్మాణం.. ముహూర్తం ఫిక్స్ చేసిన బాబు..!

చీఫ్ జాబ్ క్రియేటర్ గా లోకేష్..

వైజాగ్‌ వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌.. సంక్రాంతికి కొత్త హైవే ఓపెనింగ్‌..!

తెలంగాణకు పోలవరం నీళ్లు.. చంద్రబాబు బంపర్‌ ఆఫర్‌..!

భోగాపురం ఎయిర్‌పోర్టు.. జగన్‌ క్రెడిట్‌ చోరీ డ్రామాలు..!

జగన్‌ హయాంలోనే RLISకి బ్రేక్‌.. రేవంత్‌కు ఏపీ సర్కార్ షాక్..!

అమరావతికి కొత్త దారి.. కరకట్టకు బైపాస్‌ రెడీ..!

భారీగా పెరిగిన తిరుమల హుండీ ఆదాయం..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీకి లక్ష కోట్లు.. కేంద్రం సంక్రాంతి కానుక..!

ప్రభల తీర్థానికి రాష్ట్ర పండుగ హోదా..ఘనంగా ఏర్పాట్లు..

సంక్రాంతి సంబరాలు.. ఏపీ టూరిజానికి భారీ బూస్ట్‌..!

తెలంగాణలో టీడీపీ పునర్‌ నిర్మాణం.. ముహూర్తం ఫిక్స్ చేసిన బాబు..!

చీఫ్ జాబ్ క్రియేటర్ గా లోకేష్..

వైజాగ్‌ వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌.. సంక్రాంతికి కొత్త హైవే ఓపెనింగ్‌..!

తెలంగాణకు పోలవరం నీళ్లు.. చంద్రబాబు బంపర్‌ ఆఫర్‌..!

భోగాపురం ఎయిర్‌పోర్టు.. జగన్‌ క్రెడిట్‌ చోరీ డ్రామాలు..!

భోగాపురం.. ఎయిర్‌పోర్టు కాదు.. అంతకు మించి..!

జగన్‌ హయాంలోనే RLISకి బ్రేక్‌.. రేవంత్‌కు ఏపీ సర్కార్ షాక్..!

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

ఏపీకి లక్ష కోట్లు.. కేంద్రం సంక్రాంతి కానుక..!

ప్రభల తీర్థానికి రాష్ట్ర పండుగ హోదా..ఘనంగా ఏర్పాట్లు..

సంక్రాంతి సంబరాలు.. ఏపీ టూరిజానికి భారీ బూస్ట్‌..!

తెలంగాణలో టీడీపీ పునర్‌ నిర్మాణం.. ముహూర్తం ఫిక్స్ చేసిన బాబు..!

చీఫ్ జాబ్ క్రియేటర్ గా లోకేష్..

వైజాగ్‌ వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌.. సంక్రాంతికి కొత్త హైవే ఓపెనింగ్‌..!

తెలంగాణకు పోలవరం నీళ్లు.. చంద్రబాబు బంపర్‌ ఆఫర్‌..!

భోగాపురం ఎయిర్‌పోర్టు.. జగన్‌ క్రెడిట్‌ చోరీ డ్రామాలు..!

భోగాపురం.. ఎయిర్‌పోర్టు కాదు.. అంతకు మించి..!

జగన్‌ హయాంలోనే RLISకి బ్రేక్‌.. రేవంత్‌కు ఏపీ సర్కార్ షాక్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist