ఏపీలో అన్ని ప్రాంతాలను సమంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది కూటమి సర్కార్. ఇందులో భాగంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా ప్రాంతాలకు సమాన ప్రాధాన్యత ఇస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న కార్యక్రమాలను అందిపుచ్చుకుని రాష్ట్రంలో పెట్టుబడిదారులకు రెడ్‌కార్పెట్ పరుస్తోంది. తద్వారా వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులకు అవకాశం కల్పిస్తోంది.
తాజాగా ఏపీ స్పేస్ పాలసీని ప్రభుత్వం విడుదల చేసింది. కేంద్రం అమలు చేస్తున్న స్పేస్ మిషన్ ప్రాజెక్టుకు అనుబంధంగా ఏపీలో పెట్టుబడులు పెట్టించేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా ఏపీలోని రాయలసీమ జిల్లాలైన శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాలలో ఏపీ స్పేస్ పాలసీ కింద పెట్టుబడులు పెట్టే వారికి పెద్దపీట వేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించేందుకు, పెట్టుబడి దారులను ఆహ్వానిం చేందుకు, వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు వీలుగా ప్రభుత్వం ఏపీ స్పేస్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు.
ఈ కార్పొరేషన్ ఏం చేయనుంది –
— అంతరిక్ష రంగానికి చెందిన ప్రాజెక్టుల విషయంలో పెట్టుబడిదారులను ఆహ్వానించాలి.
— పెట్టుబడి దారులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలి.
— పెట్టుబడి దారులకు సౌకర్యాలను ఏపీలో కల్పించేలా ఈ కార్పొరేషన్ సాయం చేయాలి.
— మౌలిక వసతుల అభివృద్ధి, స్టార్టప్ నిధులు, పెట్టుబడులను ఆకర్షించాలి.
— దేశీయ, అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవాలి
— సంస్థలకు భూ కేటాయింపు, దరఖాస్తుల పరిశీలన కూడా ఈ కార్పొరేషన్ పరిదిలోనే జరగనున్నాయి.
— శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో స్పేస్ సిటీలు ఏర్పాటు చేయడమే ఈ కార్పొరేషన్ లక్ష్యం.
స్పేస్ సెక్టార్‌లో మానవ సహిత ప్రయోగాలకు..కేంద్ర ప్రభుత్వం 2030ని టార్గెట్‌గా పెట్టుకుంది. గగన్ యాన్ – 4 ప్రాజెక్టులో భాగంగా మానవులను అంతరిక్షంలోకి పంపించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రాజెక్టులను ఏపీలో రూపొందించేలా సీఎం చంద్రబాబు..ఏపీ స్పేస్ పాలసీని రూపొందించారు. ఇండిఆసో ఒక రాష్ట్ర ప్రభుత్వం అంతరిక్ష రంగానికి సంబంధించి ఒక విధానం రూపొందించడం ఇదేతొలిసారి. ఈ క్రమంలో 2030 నాటికి దేశమే కాదు..ప్రపంచం కూడా ఏపీవైపు చూసేలా చేయాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యం.











