ఆర్యవైశ్యులంటే అంత చులకనా?
విజయవాడలో మంగళవారం ఆర్యవైశ్యుల ఐక్యత సభ జరిగింది. ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్య వైశ్య నాయకులు పార్టీలకు అతీతంగా పాల్గొన్నారు. వైశ్యులపై అధికార పార్టీ చేస్తున్న దాడులను ఐక్యత వేదికపై నుంచి వక్తలు ముక్తకంఠంతో ఖండించారు. ఈ మధ్య ఒంగోలకు చెందిన వైసీపీ సీనియర్ నేత, ఆర్యవైశ్యుడు సోమిశెట్టి సుబ్బారావు గుప్తా పై మంత్రి బాలినేని అనుచరుడు సుభాని చేసిన దాడిని తీవ్రంగా తప్పుపట్టారు. ఇటువంటి భవిష్యుత్తులో జరగకుండా ఉండాలంటే అందరూ ఐక్యంగా పోరాడాలని ఈ సందర్భంగా ఆర్యవైశ్యులు తీర్మానించారు.
నేను మాట్లాడేవి పచ్చి నిజాలు ..!
మంత్రి కొడాలి, ఎమ్మెల్యేలు వల్లభనేని, అంబటి గురించి సుబ్బారావు గుప్తా సంచలన విమర్శలు చేసి అప్పట్లో వార్తలకెక్కారు! ఈ క్రమంలో సుబ్బారావు గుప్తాపై బాలినేని అనుచరుడు సుభాని దాడి చేసి, ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడంతో అది కాస్తా వైరల్ అయింది. దాడి సమయంలో నేను వైసీపీ నాయకున్నే, పార్టీ కోసం అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నాని వేడుకున్నప్పటికీ సుబ్బారావు గుప్తాను విచక్షణ రహితంగా దాడి పాల్పడ్డాడు సుభాని! ఈ నేపథ్యంలో తనపై జరిగిన దాడి విషయాన్ని విజయవాడలో జరిగిన ఐక్యత వేదికపై ఆర్యవైశ్యుల ప్రతినిధులతో సుబ్బారావు గుప్తా పంచుకున్నారు. తనకు మతిస్థిమితం లేదని ఒక్క వైసీపీ ఎమ్మెల్యే తోనైనా అనిపిస్తే మీ ఇష్టం వచ్చింది చెయ్యండి పడతానని గుప్తా సవాల్ విసిరారు. అంతేకాక వైసీపీ మాఫియా మయంగా మారిందని, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారాయన్నారు. ఏ కులంపై దాడి జరిగిన ముందుండి పోరాడుతానని సుబ్బారావు గుప్తా ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు!











