విపక్షలతో పాటు సొంత పార్టీ నేతలు కూడా కోరస్!
జగన్ రెడ్డి ప్రభుత్వంలో అవినీతి తాండవిస్తోంది! అక్రమాలకు, అవినీతికి కేరాఫ్ గా అధికారపార్టీ తయారైంది!! ఎవరి స్థాయిలో వారు అవినీతి విచ్చలవిడిగా పంచుకుంటూ .. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. ఇసుక, లిక్కర్ మాఫియా గురించి చెప్పుకోవాలంటే డైలీ న్యూస్ పేవర్స్ లో మొయిన్ ఎడిషన్లు, చానెల్స్ లో బులిటెన్స్ సరిపోవు..! మరోపక్క అధికార పార్టీ అవినీతిని ఎండగట్టడుతూ నిత్యం విపక్షాలు దుమ్మెత్తిపోస్తుంటే మరోవైపు సొంతపార్టీ నేతల కూడా బహిరంగంగానే మీడియా సమావేశాలు పెట్టి ఎమ్మెల్యేల అవినీతిని విమర్శిస్తున్నారు. ఈ నేపధ్యంలో కైకలూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు అవినీతి చిట్టాను మంగళవారం వైసీపీ అసమ్మతి నేతలు మీడియా ముందుంచారు.
ఎమ్మెల్యేకు వందలాది ఎకరాలు ఎక్కడవి..!
కృష్ణాజిల్లా కైకలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే నాగేశ్వరరావు గడిచిన రెండునరేళ్లలో వందలాది ఎకరాలను అవినీతి సొమ్ముతో కొనుగోలు చేశారని వైసీపీ రాష్ట్ర బీసీ సెల్ సెక్రటరీ పాపారావు గౌడ్ ఆరోపించారు. ఏపీలోని పలు ప్రాంతాలు, నగరాల్లో ఎమ్మెల్యే ఆస్తులను కూడగట్టుకున్నారని విమర్శించారు. అంతేకాక వైసీపీలో ఆది నుంచి కష్టపడినవారిని దూరం పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తన పదవిని అడ్డంపెట్టకుని మొత్తంగా రూ.250 కోట్లు అవినీతికి పాల్పడ్డారని రాష్ట్ర మాలమహానాడు అధ్యక్షుడు సేవనాగ జగన్ బాబురావు కూడా ఆరోపించారు.











