సాధారణంగా ఒకే కాన్పులో ఎవరికైనా ఒకరు లేదా ఇద్దరు పిల్లలు పుడతారు. ఒక్కోసారి ముగ్గురు పిల్లలు పుట్టిన సంఘటనలు కూడా అక్కడక్కడ వెలుగుచూశాయి. కానీ మాలి దేశానికి చెందిన హలీమా అనే మహిళ ఒకే కాన్పులో 9 మంది పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ఒకేసారి 9 మంది పిల్లలు పుట్టడంతో ఆ తల్లి షాక్ అయ్యింది. డాక్టర్లు అయితే అతికష్టం మీద డెలివరీ చేశారు. ఇప్పుడు ఈ విషయంలో మాలి దేశంమంతటా పాకింది. ఇది తెలుసుకున్న ప్రతిఒక్కరూ వింతలకే వింత అని అంటున్నారు. 9 మంది పిల్లల్లో నలుగురు అబ్బాయిలు, ఐదుగురు అమ్మాయిలు ఉన్నారు.











