మాస్ మహారాజా రవితేజ – గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రూపొందిన సినిమా క్రాక్. ఈ సినిమా రిలీజ్ కావడం.. బిగ్ సక్సస్ సాధించడం జరిగింది. ఈ సినిమాతో రవితేజ మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. డైరెక్టర్ గోపీచంద్ మలినేనికి మంచి పేరు వచ్చింది.
50 శాతం సిటింగ్ తో ఈ సినిమాని రిలీజ్ చేసినా.. రవితేజ కెరీర్ లోనే హయ్యస్ట్ కలెక్షన్స్ వసూలు చేయడం విశేషం. 100 శాతం సిటింగ్ కి అనుమతి ఉంటే.. అప్పుడు ఈ సినిమా ఇంకెంత కలెక్ట్ చేసుండేదో.
Also Read:-ఫైనాన్స్ రచ్చేనా : రవితేజ క్రాక్.. రిలీజ్‌కు బ్రేక్!
ఇదిలా ఉంటే.. ఈ సినిమా తెర వెనుక చాలా జరిగిందట. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఈ చిత్ర నిర్మాత ఠాగూర్.. మధు డైరెక్టర్ మలినేని గోపీచంద్ తో సినిమా చేయాలి అనుకున్నారు. ఓ కథను అనుకుని ఆ కథను రవితేజకు చెబితే.. అంతగా ఇంట్రస్ట్ చూపించలేదట. దీంతో అదే కథను కళ్యాణ్ రామ్ కి చెప్పారట. కళ్యాణ్ రామ్, అతని బంధువు హరి, మలినేని గోపీచంద్ ఈ కథకి మెరుగులు దిద్దారట.
అప్పుడు కథ బాగా వచ్చిందనే విషయం రవితేజకు తెలిసిందట. అంతే.. రవితేజ లైన్ కి వచ్చారట. రవితేజ ఇంట్రస్ట్ చూపించడంతో కళ్యాణ్ రామ్ కి సారీ చెప్పి.. రవితేజతో సినిమా తీశారు. ఇప్పుడు క్రాక్ పెద్ద హిట్ అయ్యింది. అదే.. కళ్యాణ్ రామ్ ఈ సినిమా చేసుంటే.. ఎలా ఉండేదో ఏమో కానీ.. మాంచి యాక్షన్ మూవీని మాత్రం మిస్ అయ్యారు.
Also Read:-శృతిహాసన్ తో రొమాన్స్ చేయనున్న‘వకీల్ సాబ్’