పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్. ఈ చిత్రానికి ఎంసీఏ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు – బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ లో ఇటీవల పవన్ కళ్యాణ్ జాయిన్ అయ్యారు. అయితే.. హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల నేపధ్యంలో షూటింగ్ కి బ్రేక్ ఇవ్వడం జరిగింది. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీపావళికి ఈ సినిమా టీజర్ రిలీజ్ చేస్తారనుకున్నారు కానీ.. రిలీజ్ చేయలేదు.
దీంతో వకీల్ సాబ్ అప్ డేట్ ఎప్పుడు వస్తుందా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో శృతిహాసన్ నటించనున్నట్టు వార్తలు వచ్చాయి కానీ.. అఫిషియల్ గా ప్రకటించలేదు. అలాగే శృతిహాసన్ ఇంకా ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ కాలేదు. తాజా వార్త ఏంటంటే.. వచ్చే వారం నుంచి షూటింగ్ లో పాల్గొనడానికి పవన కళ్యాణ్ ఓకే చెప్పారట. వచ్చే రెండు వారాల్లో ఈ సినిమా షూటింగ్ లో పాల్గొని షూటింగ్ కంప్లీట్ చేస్తానని పవన్ చెప్పారని సమాచారం. ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్, శృతిహాసన్ ల పై రొమాంటిక్ సీన్స్ చిత్రీకరించనున్నారని తెలిసింది.
ఈ సినిమాలో శృతిహాసన్ క్యారెక్టర్ చిన్నదే. కేవలం 20 నిమిషాలు మాత్రమే కనిపిస్తుంది. చిన్న క్యారెక్టరే అయినప్పటికీ.. టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు – బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కఫూర్ నిర్మిస్తున్న సినిమా కావడం.. ఇందులో పవన్ కళ్యాణ్ హీరో కావడంతో వెంటనే ఓకే చెప్పిందట. సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. ప్రకటించలేదు. సమ్మర్ కి రిలీజ్ చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లును ఓపెన్ చేయడానికి అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో డిసెంబర్ నెలాఖరు నుంచి సినిమాల రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. మరి.. వకీల్ సాబ్ రిలీజ్ ఎప్పుడు ఉంటుంది అనేది త్వరలోనే క్లారిటీ రానుంది.
Must Read ;- పవన్ ‘పోలెనా’ ఆ కళ్లు, ఆ నడక.. సేమ్ టు సేమ్