పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో ఈ సినిమా రూపొందుతోంది. బాలీవుడ్ హిట్ మూవీ పింక్ కి రీమేక్ గా రూపొందిన ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. సంక్రాంతికి రిలీజ్ అనుకున్నారు కానీ.. కుదరలేదు. రిలీజ్ ఎప్పుడు అనేది త్వరలోనే ప్రకటించనున్నారు. మలయాళంలో విజయం సాధించిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. పవన్ – రానా కలిసి నటిస్తున్న ఈ సినిమాని సితార ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది.

ఈ సినిమా షూటింగ్ త్వరలో స్టార్ట్ చేయనున్నారు. మాటల మాంత్రికుడు దీనికి డైలాగ్స్ రాస్తుండడం విశేషం. యంగ్ డైరెక్టర్ సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ కంప్లీట్ చేయాలనేది ప్లాన్. అయితే.. ఈ సినిమా కంప్లీట్ అయ్యే వరకు క్రిష్ తో చేస్తున్న సినిమాని చేయరు అనుకున్నారు కానీ.. ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ స్టార్ట్ చేసే లోపు ఓ చిన్న షెడ్యూల్ చేయాడానికి ఓకే చెప్పారట. ఈ సినిమాని సీనియర్ ప్రొడ్యూసర్ ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
పవన్ చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇదే కావడం విశేషం. ఇక ఈ సినిమాల రిలీజ్ విషయానికి వస్తే… వకీల్ సాబ్ మూవీని ఏప్రిల్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయ్యనుమ్ కోషియుమ్ రీమేక్ ఆగస్ట్ లోగా రిలీజ్‌కి రెడీ అవ్వచ్చు. క్రిష్ తో చేస్తున్న మూవీ అక్టోబర్ కి షూటింగ్ కంప్లీట్ అవుతుంది. ఈ సినిమాకి గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువుగా ఉంటుంది. అందుచేత ఈ సినిమాని 2022 సంక్రాంతికి రిలీజ్ చేయచ్చు. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ తో సినిమా, ఆతర్వాత సురేందర్ రెడ్డితో సినిమా ఉంటుంది. మొత్తానికి వచ్చే సంవత్సరం పవన్ ఫ్యాన్స్ కి పండగే.
Also Read: వకీల్ సాబ్ పవర్ చూపించిన మోషన్ పోస్టర్











