మాస్ మహారాజా రవితేజ – మలినేని గోపీచంద్ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం క్రాక్. రవితేజ – శృతిహాసన్ జంటగా నటించిన క్రాక్ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ డే నుంచే హిట్టు టాక్ సొంతం చేసుకుంది. 50 శాతం సిటింగ్ కే పర్మిషన్ ఇచ్చినప్పటికీ.. క్రాక్ మూవీ రికార్డు స్ధాయి కలెక్షన్స్ వసూలు చేస్తుండడం విశేషం. అంతే కాకుండా సంక్రాంతికి రిలీజైన సినిమాలన్నింటిలో క్రాక్ మూవీనే విజేతగా నిలిచింది.
పండగ అయినా కలెక్షన్స్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఇదిలా ఉంటే.. ఫుల్ మాస్ మూవీని అందించిన డైరెక్టర్ మలినేని గోపీచంద్ ని పలువురు సినీ ప్రముఖులు ప్రశంసించారు. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సైతం మలినేని గోపీచంద్ ని అభినందించారు. చిరంజీవి ప్రత్యేకంగా గోపీచంద్ ని పిలిపించుకుని క్రాక్ మూవీలోని ప్రతి సన్నివేశం గురించి వివరంగా చెబుతూ తనకు ఎంత బాగా నచ్చిందో చెప్పారట.
చిరంజీవి ఇలా తమ సినిమా గురించి డీటైల్ గా చెబుతుంటే ఎవరికైనా ఇంతకన్నా ఇంకేం కావాలి. సినిమాలోని ప్రతి సీన్‌ను చిరంజీవి గారు తనకు వివరించిన తీరుకి ఆశ్చర్యపోయినట్లుగా గోపీచంద్ మలినేని తెలిపారు. సినిమా చాలా చక్కగా తీశావని అభినందనలు తనకు ఎంతో ఎనర్జీని ఇచ్చాయి అంటూ సంతోషం వ్యక్తం చేశారు. హిట్ సినిమా ఎవరు తీసినా అభినందించడంలో ముందుంటారు మెగాస్టార్. అలాగే ఆయనకు నచ్చితే ఆయా డైరెక్టర్ కి అవకాశాలు కూడా ఇస్తుంటారు. మరి.. గోపీచంద్ మలినేనికి కూడా ఆఫర్ ఇస్తారేమో చూడాలి.
Must Read ;- బాలయ్యతో మూవీ ప్లాన్ చేస్తున్న ‘క్రాక్’ డైరెక్టర్