కరోనా కాలం సినీ హీరోలకు పెళ్లి కాలం అనే చెప్పాలి. ఈ రంగంలో మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచిలర్స్ అందరికీ పెళ్లిళ్లు అయిపోతున్నాయి. మొన్నీ మధ్యే దగ్గుబాటి రానా, నితిన్ పెళ్లి చేసుకున్నారు. టాలీవుడ్ లో ఇది పెళ్లి సందడి కాలమేనని చెప్పాలి. హీరోలే కాదు దర్శకులు, నిర్మాతలు, రచయితలు, హీరోయిన్లు… ఇలా పెళ్లి పీటలు ఎక్కిన వారు చాలామందే ఉన్నారు. పెళ్లి పీటలెక్కబోతున్న హీరోల జాబితాలో ఇప్పుడు శర్వానంద్ కూడా చేరబోతున్నారు. శర్వానంద్ హీరోగా సినీ రంగ ప్రవేశం చేసి దాదాపు 16 ఏళ్లుకు పైనే అయింది.
విజయవాడలో ప్రముఖ విద్యాసంస్థలో కీలక పాత్ర పోషించిన ముమ్మనేని సుబ్బారావుకు శర్వానంద్ మనవడు అవుతారు. శర్వా వయసు ఇప్పుడు 36 ఏళ్లు. తన చిన్ననాటి స్నేహితురాలినే పెళ్లి చేసుకోడానికి శర్వా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆ అమ్మాయి కూడా ఓ మహిళా పారిశ్రామిక వేత్త అంటున్నారు. కొన్నేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. మరో పక్క పెళ్లి చేసుకోమంటూ స్నేహితుల ఒత్తిడి. దాంతో శర్వా ఇంట్లో కూడా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. త్వరలోనే ఈ జంట పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం శర్వానంద్ ‘శ్రీకారం’ సినిమా చేస్తున్నారు. మరో రెండు సినిమాల కమిట్ మెంట్స్ ఉన్నాయి. పెళ్లి తర్వాత ఈ ప్రాజెక్టులు పట్టాలెక్కనున్నట్లు సమాచారం.