ప్రస్తుతం ఓటీటీలో టాక్ షోలకు మంచి డిమాండ్ ఏర్పడింది. అందులోనూ.. హాట్ బ్యూటీస్ చేసే టాక్ షోలకు అయితే.. మంచి రెస్పాన్స్ లభిస్తోంది. మొన్నామధ్య సమంతా ఆహా కోసం ‘సామ్ జామ్’ అనే టాక్ షో చేసిన సంగతి తెలిసిందే. అలాగే.. అదే ఓటీటీ .. తమన్నా తో కూడా ఓ టాక్ షో చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడీ లిస్ట్ లోకి గోవా కోవా ఇలియానా కూడా చేరబోతోంది.
అమెజాన్ ప్రైమ్ వారు ఇలియానాతో టాక్ షో కి సంబంధించిన అగ్రిమెంట్ కూడా పూర్తి చేశారట. దీనికోసం ఇల్లూ బేబ్ భారీ ఎత్తున పారితోషికం అందుకోనుందని తెలుస్తోంది. తొలి సీజన్ లో వచ్చే రెస్పాన్స్ ను బట్టి.. సెకండ్ సీజన్ లో ఇలియానాను కంటిన్యూ చేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటారట.
ఇలియానాకి సౌత్ లో మంచి పాపులారిటీ ఉంది. బాలీవుడ్ లోనూ సినిమాలు చేసిన అనుభవం ఉంది. అలాగే.. అమ్మడికి పాన్ ఇండియా స్థాయిలోనూ మంచి గుర్తింపు ఉంది. అందుకే పారితోషికం ఎక్కువైనా సరే.. ఇలియానాను టాక్ షో కి ఎంపిక చేశారట. ప్రముఖ దర్శకుడి ఆధ్వర్యంలో టాక్ షో నడుస్తుందని సమాచారం. మరి ఈ టాక్ షో ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.











