Akhil Interested To Act In Virat Kohli Biopic
అక్కినేని అఖిల్ నటించిన తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు, వాసు వర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అక్టోబర్ 15న విడుదలవుతుంది. అక్కినేని అభిమానులు ఈ సినిమా ఖచ్చితంగా అఖిల్ కి విజయాన్ని అందిస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్ వ్యూలో అఖిల్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టాడు.
అది ఏంటంటే… తాను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బయోపిక్ లో నటించాలనుకుంటున్నానని అఖిల్ తెలియచేశాడు. అఖిల్ స్వతహాగానే శిక్షణ పొందిన క్రికెటర్. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో సత్తా చాటాడు. తాను పర్ఫెక్ట్ స్పోర్ట్ పర్సనాలిటీ అని నిరూపించేందుకే విరాట్ బయోపిక్ లో నటిస్తానని చెప్పాడు. తనకు కోహ్లీ అంటే చాలా ఇష్టం. అతడి ఆటను తొలి నుంచి పరిశీలిస్తున్నానని ..అతని జీవితంలో పైకి కనిపించని భడభాగ్ని ఉందని కూడా అఖిల్ అన్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సరైన స్క్రిప్ట్ కోసం ఎదురు చూస్తున్నాను. అది నేను స్పోర్ట్స్ పర్సన్ అని అందరినీ ఒప్పిస్తుందని అఖిల్ నమ్మకాన్ని వ్యక్తం చేశాడు.
Akhil Interested To Act In Virat Kohli Biopic
సినిమా బలంగా ఉండాలంటే.. స్పోర్ట్స్ బయోపిక్ లకు బలమైన కంటెంట్ అవసరమని .. కథ బాగుంటే తప్పా.. క్రీడ తెర పై హైలైట్ కాదని కూడా అఖిల్ అన్నారు. విరాట్ కోహ్లీ జీవితం అభిరుచి.. అంకితభావంతో నిండి ఉంది. అతను నన్ను చాలా విధాలుగా ప్రభావితం చేశాడు. ఏదో ఒకరోజు అతని పై కథ రాస్తే చాలా బాగుంటుంది. అందులో నేను నటిస్తాను అని అఖిల్ అన్నారు. మరి.. విరాట్ కోహ్లీ జీవితం పై ఎవరు కథ రాస్తారో..? ఎవరు డైరెక్ట్ చేస్తారో..? తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.











