టాలీవుడ్ లో డైరెక్ట్ ఓటిటి పద్ధతిలో విడుదల అవుతున్న మొట్టమొదటి భారీ సినిమాగా వి గురించి అంతా చర్చించుకుంటున్నారు. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా దాదాపు 33 కోట్లు బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.
ఈ మూవీలో నాని, సుధీర్ బాబు హీరోలుగా నటించారు. నివేద థామస్, అదితిరావ్ హైదరీ హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. కరోనా లాక్ డౌన్ ప్రకటించక ముందే వి సినిమా విడుదల అవ్వాల్సింది కానీ దిల్ రాజు అతి జాగ్రాత్త వల్ల ఈ మూవీ మార్చి 28, 2020న విడుదల చేయాలని చూసి ఆ టైమ్ కి థియేటర్లు మూసేయడంతో మొదటికే మోసం వచ్చింది.
దీంతో ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో వి ని డైరెక్ట్ గా విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను ఓటిటిలో విడుదల చేస్తున్నారని ప్రకటించిన వెంటనే ఇండస్ట్రీ మొత్తం తెగ చర్చలు జరిగాయి. ఈ సినిమా హీరో నానికి అందరూ శుభాకాంక్షలు తెలుపుతూ పరిశ్రమకి ఇది మంచి పరిణామం అని తెగ పొగిడేశారు.
అయితే ఇదే ట్రెండ్ చూపించి దిల్ రాజు అమెజాన్ వారి దగ్గర మరికొంత అమెంట్ ఇవ్వాల్సిందిగా రీల్ డీల్ చేసినట్లుగా సమాచారం. దీనికి అమెజాన్ వారు కూడా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చారట, అయితే గత అయిదు రోజులుగా వి గురించి మీడియాలో కానీ, ఇండస్ట్రీలో కానీ ఎవ్వరూ చర్చించుకోవడం లేదు. ఈ సినిమా మీద బజ్ ఒక్క సారిగా చల్లారిపోయింది. ఇదే విషయాన్ని అమెజాన్ వారు దిల్ రాజు దృష్టికి తీసుకువస్తే, వారికి సరైన స్పందన రాలేదని తెలిసింది. దీంతో అమెజాన్ వారు వి మీద కాస్త అసంతృప్తిగానే ఉన్నారని టాక్.