ఏపీ సిఎం జగన్ పై మాజీమంత్రి, టిడిపి సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు ప్రభుత్వం పెగసిస్ సాఫ్ట్ వేర్ కొనలేదని స్వయంగా నీ సవాంగన్నే చెప్పారు జగన్ రెడ్డి అంటూ ట్విట్టర్ వేధికాగా జగన్ కు అయ్యన్నపాత్రుడు కౌంటర్ ఇచ్చారు. కర్నూలు జిల్లాకు చెందిన నాగేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం ప్రకారం 2020 జులై 25వ తేదీని అడిగిన ప్రశ్నకు సమాధానంగా అసలు అటువంటి సాఫ్ట్ వేర్ ఏదీ కొనలేదని స్వయంగా నాటి డీజీపీ సవాంగ్ 2021 ఆగస్టు 12న సమాధానం ఇచ్చారని ఆయన తెలిపారు. జగన్ రెడ్డి, ఆయన మీడియా చేసేవన్నీ అసత్య ప్రచారాలే అని స్వయంగా జగన్ బయటపెట్టడమే దేవుడి స్క్రిప్ట్..’’ అని ఎద్దేవా చేస్తూ అయ్యన్న ట్వీట్ చేశారు.
Must Read:-దేవాలయాలపై దాడుల్లో రాజకీయ నేతల ప్రమేయం.. డీజీపీ సవాంగ్