స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ల క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ యాక్షన్ మూవీ పుష్ప. ఆర్య, ఆర్య 2 చిత్రాల తర్వాత బన్నీ, సుక్కు కలిసి చేస్తున్న సినిమా కావడంతో పుష్ప సినిమా పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు.
పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా ఫాస్ట్ గా జరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా నుంచి ఓ క్రేజీ అప్ డేట్ బయటకు వచ్చింది. అది ఏంటంటే.. ఇప్పటికే ఒక టీజర్, మూడు సింగిల్స్ విడుదల చేశారు. వీటికి ఊహించిన దానికంటే ఎక్కువుగా రెస్పాన్స్ వచ్చింది. దీంతో పుష్ప పై అంచనాలు రెట్టింపు అయ్యాయని చెప్పచ్చు. ఈ నేపథ్యంలో దీపావళికి మరో టీజర్ తో అభిమానులకు స్పెషట్ ట్రీట్ ఇవ్వబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం పుష్ప టీజర్ ను కట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు దర్శకుడు సుకుమార్. తాజా సమాచారం ప్రకారం.. నవంబర్ 4న పుష్ప ది రైజ్ ప్రత్యేక టీజర్ ను విడుదల చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది.
ఇంతకుముందు అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రను పరిచయం చేస్తూ టీజర్ విడుదల చేయగా.. ఇప్పుడు ఈ సినిమాలోని అన్ని పాత్రలతోనూ పరిచయం చేస్తూ ఓ టీజర్ ను కట్ చేస్తున్నారని తెలిసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్త నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాకి రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మ్యూజిక్ సినిమాకి హైలైట్ అనేలా ఉంటుందట. టీజర్ అండ్ సాంగ్స్ తో విశేషంగా ఆకట్టుకున్నారు. మరి.. దీపావళికి రానున్న పుష్ప న్యూ టీజర్ ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.











