మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ చీఫ్ జగన్‌మోహన్‌రెడ్డికి షాక్ తగలబోతుందా, అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఇకపై ఆయనకు Z+ కేటగిరీ భద్రత లభించే ఛాన్సులు కనిపించడం లేదు. ఏపీ హైకోర్టులో జగన్ వేసిన పిటిషన్ పై మంగళవారం జరిగిన విచారణ తీరును గమనిస్తే…ఈ మాజ నిజమేననిపిస్తోంది. ఎందుకంటే.. జగన్ కు Z+ కేటగిరీ సెక్యూరిటీ కల్పించేంత ముప్పేమీ లేదని, అసలు జగన్ కు ఎలాంటి ప్రాణహానీ లేదని కేంద్ర హోం శాఖతో పాటు సెంట్రల్ ఇంటెలిజెన్స్ శాఖ కోర్టుకు స్పష్టం చేశాయి.
జగన్ 2014లో ప్రదాన ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కూడా ఆయనకు Z+ కేటగిరీ సెక్యూరిటీ భద్రత లేదు. అయితే 2019లో సీఎం కాగానే…కేంద్రం జగన్ కు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించింది. సీఎంగా జగన్ దిగిపోయిన తర్వాత కూడా జెడ్ ప్లస్ భద్రత కొనసాగింది గానీ…ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి గుంటూరు మిర్చి యార్డును సందర్శించిన జగన్ రాజకీయ ప్రసంగం చేశారు. ఈ పరిస్థితిని ముందుగానే గమనించిన కేంద్రం ఈ పర్యటనలో జగన్ కు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను ఉపసంహరించింది.
ఈ పరిణామంతో ఆందోళన చెందిన జగన్ తనకు Z+ కేటగిరీ సెక్యూరిటీ పునరుద్ధరించేలా కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు…కేంద్ర హోం శాఖతో పాటు సెంట్రల్ ఇంటెలిజెన్స్ శాఖలకు నోటీసులు జారీ చేసింది. జగన్ పిటిషన్ పై కౌంటర్లు దాఖలు చేయాలని వాటిలో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నోటీసులకు తాజాగా ఆ రెండు సంస్థలు స్పందించి…తమ స్పందనను తెలియజేశాయి.











