ఏపీ లిక్కర్ స్కామ్‌లో రాజ్ కేసిరెడ్డిని బలి పశువును చేయబోతున్నారా..అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ తర్వాత వైసీపీ మాజీ నేత విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనం. ఏపీ లిక్కర్ స్కామ్‌లో కర్త, కర్మ, క్రియ మొత్తం రాజ్ కెసిరెడ్డేనని జగన్‌కు సంబంధం లేదని విజయసాయి చెప్పారు. అంటే అసలు నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని అర్థమవుతోంది. ఇక, లిక్కర్ స్కామ్‌లో మిథున్ రెడ్డికి సైతం హస్తం ఉందన్నారు విజయసాయి రెడ్డి. మిథున్ రెడ్డి సూచనల మేరకు సజ్జల శ్రీధర్‌రెడ్డికి తాను 100 కోట్లు సర్దుబాటు చేయించిన విషయాన్ని కూడా EDకి చెప్పానన్నారు.
……………..
ఈ కేసుతో జగన్‌కు సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేశారు విజయసాయిరెడ్డి. ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ రెడ్డికి తన ప్రభుత్వంలో జరుగుతున్న వేల కోట్ల స్కామ్ గురించి తెలియదనడం హాస్యాస్పదం. కేవలం రాజ్ కేసిరెడ్డినే ఇదంతా చేశాడని చెబుతున్నారు విజయసాయి రెడ్డి. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో మద్యం పాలసీని మార్చింది జగన్ సర్కార్. ప్రముఖ బ్రాండ్లను బ్యాన్ చేసింది. ఊరు, పేరు లేని బ్రాండ్లను తీసుకువచ్చి ఏపీ ప్రజలకు భారం మోపింది. ఈ పాలసీ చాటున ఐదేళ్ల పాటు వైసీపీ నేతలు వేల కోట్లు వెనకేసుకున్నారు. ప్రత్యర్థి పార్టీలు ఈ స్కామ్ విలువ దాదాపు 10 వేల కోట్లకుపైగానే ఉంటుందని ఆరోపిస్తున్నాయి. ఐతే ప్రాథమిక అంచనాల ప్రకారం..ఈ కుంభకోణం విలువ దాదాపు రూ.3500 కోట్లుగా ఉంటుందని నిర్ధారించాయి.
……………..
ఈ కేసులో కీలక నిందితుడైన రాజ్ కేసిరెడ్డిని సిట్ అరెస్టు చేసింది. రాజ్ కేసిరెడ్డికి చెందిన రూ. 62.85 కోట్ల నగదు, ఇతర ఆస్తులను సిట్ జప్తు చేసింది. సుమారు 40 మందికి పైగా నిందితులపై సిట్ చార్జిషీట్లు దాఖలు చేసింది. ఇక సిట్ నమోదు చేసిన FIR ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ కుంభకోణం కేవలం ఏపీకే పరిమితం కాలేదని, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు మరియు ఢిల్లీ వరకు దీని మూలాలు ఉన్నాయని ఈడీ గుర్తించి 20కి పైగా చోట్ల దాడులు నిర్వహించింది.
……………..
ఈ కేసులో భాగంగానే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిలను ఈడీ విచారించింది. హవాలా మార్గంలో డబ్బు విదేశాలకు మళ్లినట్లు ED అనుమానిస్తోంది. కిక్‌బ్యాక్స్ రూపంలో వచ్చిన డబ్బును దాదాపు 25 షెల్ కంపెనీల ద్వారా రియల్ ఎస్టేట్ మరియు సినిమా రంగాల్లోకి మళ్లించినట్లు దర్యాప్తులో తేలింది.
బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!
rహెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం...










