అనగనగా ఓ జగన్ రెడ్డి.. ఆయనొకప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం నలుదిక్కుల సర్వనాశనమైంది.. ఆ చీకటి రోజులు గుర్తు చేసుకుంటుంటే.. దుర్భర జీవితం కళ్ల ముందు నడియాడినట్లు ఉంటుంది రా .. చిన్నా.. అని ఏపీలోని ఈ తరం వాళ్లు.. భావి తరాలకు చెప్పుకోక తప్పని పరిస్ధితి. ఎందుకంటే అనుభవించిన చీకటి రోజులు భావి తరాలకు పట్టకూడదని….
జగన్ రెడ్డి పాలనలో నీచ రాజకీయాలు.., అవినీతి.., దౌర్జన్యకాండను వేరు చేసి చూడలేం అన్నట్లు ఉంటుంది. జగన్ రెడ్డి ఈ 56 నెలలు పాలనలో సాగిందంతా నెక్స్ట్ లెవల్ ఆరాచకమే. 75 సంవత్సరాల స్వంతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నడూ సాగని విధ్వంసకర అరాచక పాలనను ఏపీ ప్రజలు ఈ నాలుగునరేళ్ళు చూశారు. అందుకే భవిష్యత్తులో జగన్ రెడ్డిలాంటి మోస్ట్ వాంటెడ్ కరెప్టెడ్ పొలిటిషన్ ను ముఖ్యమంత్రిగా ఎన్నుకోకూడదని ఈ తరం వాళ్ళు.. భావి తరాలకు చెప్పుకునే రోజు వస్తాయన్నది ఊహించి తీరాల్సిందే. ఎందుకంటే అటువంటి రాజకీయ వాస్తవ పరిస్ధితులను ఏపీలో ప్రజలు జగన్ పాలనలో చూస్తున్నారు కాబట్టి. కళ్లకు కట్టే కర్కస విధానాలను చవిచూస్తున్నారు. అన్నీ రంగాలను నిలువు దోపిడి చేసి.. వ్యవస్ధలన్నీంటినీ కూలదోశాడు జగన్ రెడ్డి పాలన విధానాలను అందరూ అసహ్యించుకుంటన్నారు.
ఇదిలా ఉంటే .. జగన్ రెడ్డి నాలుగేళ్లుగా ప్రతి వేదికపై.. నేను మీ బిడ్డను.. అంటూ ఓదరగొడుతూ.. ఆస్తులను లాక్కుంటున్నారు. నిలువ దోపిడి చేస్తున్నారు. మీ బిడ్డనే అంటూనే బడుగు బలహీన, అనగారిన వర్గాలను ఊచకోత కొస్తున్నారు… మీ బిడ్డనే అంటూనే నాణ్యతలేని నకిలీ మద్యాన్ని ప్రజలకు అంటగట్టి..శ్మశానాలకు సాగనంపుతున్నారు. మీ బిడ్డను అంటూనే అన్నీ రంగాలపై దేశంలో ఎక్కడ చూడని,వినని అధిక పన్నుల భారాన్ని మోపి.. ఓనర్లను ఘనతకెక్కడు. ఇవన్నీ జెస్ట్ శాంపీల్సే. ఫైనల్ గా చెప్పాలంటే ఏపీ జీవించే ప్రతిఒక్కరిని ప్రత్యక్ష్యంగా .., పరోక్షంగా జగన్ రెడ్డి దోపిడికి.., సైకోయిజానికి బలైన వాళ్ళే. తప్పించుకున్నవాళ్ళు పుణ్యాత్ములు సుమీ..
అందుకే ప్రజలు జగన్ రెడ్డి హయాన్ని ఈ తరం వాళ్ళు బతికున్నంత కాలం గుర్తు చేసుకుంటూ.. ఆ కాలంలో ఏపికి తుగ్లక్ ముఖ్యమంత్రి అనేవారు ఒకరుంటడే వారు.. ఆయనన్ను నమ్మి.. ఓటేసిన పాపానికి ఆస్తులను, చివరికీ రక్తమాంసాలను కూడా లాక్కునే స్ధాయికి ప్రభుత్వాన్ని దిగజార్చడని భవిష్యత్తు తరానికి తప్పని సరిగా చెప్పుకోక తప్పని అనివార్య పరిస్ధితి. ఇది నమ్మినా.. నమ్మకున్నా.. అక్షర సత్యం. అభిమానంతో ఓటేస్తే అడుక్కుతినేలా చేశాడని.., జగన్ ను జీవితాంత తిట్టిపోస్తూనే ఉంటారన్నది పచ్చి నిజం.