పేటీఎం తన కస్టమర్లకు అందించే సేవల్లో కొన్ని మార్పులను తీసుకొచ్చింది. ఈ విషయం తెలియకుండా పేటీఎంను చెడా మడా వాడేసుకుంటే మీకు అదనపు ఛార్జీలు తప్పవు. క్రెడిట్ కార్డు ద్వారా పేటీఎం వినియోగదారులు నగదును తమ వ్యాలెట్‌కు యాడ్ చేసుకుంటే 2శాతం ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డు వినియోగంపై వ్యాలెట్‌కు టాపప్ చేసుకుంటే ఈ ఛార్జీ వర్తిస్తుంది. గతంలో తమ వ్యాలెట్‌కు క్రెడిట్ కార్డు ద్వారా నెలకు పదివేలకు మించి యాడ్ చేసుకుంటే 2శాతం ఛార్జ్ చెల్లించవలసి వచ్చేది. తమ క్రెడిట్ కార్డు ద్వారా వ్యాలెట్‌కు నగదును యాడ్ చేసుకుంటే ఇక నుంచి ఛార్జ్ వసూలు చేయనుంది. అయితే ఈ నిబంధనలు అక్టోబర్ నుంచే అమలులోకి వచ్చాయి. ఇది తెలియక చాలా మంది కస్టమర్లు తమ డబ్బులు అసలు ఎలా కట్ అవుతున్నాయో అర్ధం కాక కొంతమంది తలలు పట్టుకుంటున్నారు.
అయితే ఎలాంటి ఛార్జీలు కట్టకుండానే నగదును మీ వ్యాలెట్‌కు పంపించుకోవాలంటే డెబిట్ కార్డులను ఉపయోగించాలని పేటీఎం పేర్కొన్నది. అలాగే నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా నగదును ఉచితంగా పంపిచుకోవచ్చు. క్రెడిట్ కార్డు కంపెనీలు, బ్యాంకులు నగదును పేటీఎంలోకి యాడ్ చేయడం ద్వారా ఫీజును వసూలు చేస్తుండటంతోనే ఈ విధమైన 2 శాతం నిబంధనను పేటీఎం తీసుకొచ్చింది. క్రెడిట్ కార్డు ద్వారా రూ.50 నుంచి రూ.200 వరకు నగదు జత చేస్తే 2 శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చని తెలిపింది. అయితే పేటీఎం తీసుకొచ్చిన 2 శాతం ఛార్జ్ నిబంధనను 2017లోనే తీసుకొచ్చింది. కానీ క్రెడిట్ కార్డుల ద్వారా వ్యాలెట్‌లోకి నగదును జత చేస్తే ఛార్జ్ వసూలు చేయడాన్ని అప్పట్లో కస్టమర్ల నుంచి ఒత్తిడి రావడంతో ఆ నిబంధనను వెనక్కుతీసుకుంది. అక్టోబర్ నుంచి మరో సారి దీనిపై ఛార్జీ వసూలు చేస్తోంది. ఇది తెలవకా కస్టమర్లు మనీ ట్రాన్సఫర్‌ను విచ్చిలవిడిగా చేసుకుంటూ అదనపు ఛార్జీలు కట్టుకుంటున్నారు. సో కాస్త జాగ్రత్త పడండి.











