సీఐడీ అరెస్టు చేసిన ఎంపీ రఘురామరాజును గుంటూరులోని జిల్లా జైలుకు తరలించారు.రఘురామరాజుకు ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం అందించాలని కోర్టు ఆదేశించినా సీఐడీ పోలీసులు పట్టించుకోలేదు.గుంటూరు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం రఘురామరాజును గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.మెడికల్ రిపోర్టును సీల్డు కవర్‌లో ఉంచి కోర్టుకు అందించినట్టు తెలుస్తోంది.ప్రైవేటు ఆసుపత్రిలో కూడా వైద్య పరీక్షలు నిర్వహించాలని సీఐడీ కోర్టు న్యాయమూర్తి ఆదేశించినా పట్టించుకోలేదు.కేవలం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. తాజాగా కోర్టు ఆదేశాలను ధిక్కరించి జైలుకు తరలించారు.సీఐడి కోర్టు ఒక మాదిరి,హైకోర్టు మరో తరహాలో తీర్పు ఇవ్వడంతో పోలీసులు ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక జిల్లా జైలుకు తరలించినట్టు తెలుస్తోంది.
లోకేష్ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్..!
ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...











