ఏపీ రాజకీయాలు అనుహ్యంగా మారుతున్నాయి. జగన్ రెడ్డి పాపిష్టి పాలన విమూక్తిని కోరుకుంటున్నారు. అందుకే ఆ వైసీపీలోని ఆర్యవైశ్య ముఖ్య నాయకులందరూ దూరంగా జరుగుతున్నారు.
ఏపీలో జగన్ పాలన.. మూడు విధ్వంసాలు.., ఆరు అక్రమ కేసుల ఆరాచకంతో వర్ధిల్లుతోంది. ప్రశ్నిస్తే కేసులు.., విమర్శిస్తే దాడులు.., నిలదీస్తే హత్యలే అన్నట్లు సాగుతున్న జగన్ రెడ్డి పాలనను సొంత పార్టీ వారే చీదరించుకుంటన్నారు. ఈ నేపధ్యంలో గత నాలుగేళ్ళుగా వైసీపీలోని ఆర్యవైశ్యులు జగన్ రెడ్డి విధానాలను గమనించుకోనే ఆయనకు దూరంగా జరుగుతున్నారు. మా కొద్దు రా బాబు ఈ రాజకీయాలు అంటూ.. పార్టీని వీడి.. రాజకీయాలు నుంచి తప్పుకుంటున్నారు. ఆ మధ్య ఒంగోలులో సుబ్బారావు గుప్తా పై దాడి, ఆ తరువాత గిద్దలూరు ఎమ్మెల్యే రాంబాబు పై జగన్ రెడ్డి బాబాయ్ సుబ్బారెడ్డి వివక్ష వంటివి ఆర్యవైశ్యుల్లో కలవరపాటుకు గురిచేశాయి.
ఇలా రాష్ట్రంలో అనేక రాజకీయ పరిణామాలు ఆర్యవైశ్యులను ఆలోచింపజేస్తున్నాయి. మరోవైపు విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావును మంత్రి పదవీ నుంచి తప్పించారు. ఆ తరువాత రాజకీయంగా తొక్కెందుకు ఆయనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ కూడా ఇచ్చేందకు వైసీపీ విముఖత చూపుతోంది. ఇదిలా ఉంటే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ కూడా జగన్ రెడ్డి మోసపూరిత హామీలను నమ్మి రెబల్ ఎమ్మెల్యేగా మారాడు. జగన్ రెడ్డి ప్రభుత్వానికి అడుగులకు మడుగులు వత్తారు. చివరకు మద్దాలిని పక్కన పెట్టి.. ఆ స్ధానానికి మంత్రి విడుదల రజినీని వైసీపీ అధిష్టానం నియమించింది.
దీంతో మద్దాలిని పక్కన పెట్టడాన్ని ఆర్యవైశ్యులు మండిపడుతున్నారు. మరోవైపు ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య మాజీ మంత్రి సిద్ధా రాఘరావు కూడా టీడీపీని వీడి వైసీపీలో చేరారు. జగన్ మాటలు నమ్మి.., వైసీపీ చేరి..చివరికి సామాజీకంగా, రాజకీయంగా నలిగిపోయారు. ఇవన్నీ ఇలా ఉంటే వైసీపీ ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్ష పదవిలో కీలక నాయకుడిగా వ్యవహరిస్తున్న బాలజీ గుప్తా ఆ పదవీకి, పార్టీకి రాజీనామా చేశారు. మంగళగిరి మున్సిపల్ వైస్ ఛైర్మన్ గా వ్యవహరించిన బాలజీ గుప్తా నిర్ణయం సంచలనంగా మారింది. పార్టీలో ఎంతో కీలకంగా వ్వవరించే వ్యక్తే ఇటువంటి నిర్ణయం తీసుకోవడం చూస్తే .. వైసీపీలో కొనసాగే ఆర్యవైశ్యులంత ఆ పార్టీలో అంత సేఫ్ కాదన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కదిద్దుకోవాలన్న నేపధ్యంలోనే ఏపీ వ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్యులు ఒక్కొక్కరుగా ఇలా వైసీపీని వీడి.. జగన్ కు దూరంగా జరుగుతున్నాయన్నది వాస్తవం.











