ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై భేటీ అయిన బీఏసీ సమావేశాలు ముగిశాయి. అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలు, ప్రవేశపెట్టే బిల్లులు, సభ ఎన్నిరోజులు నిర్వహించాలనే విషయాలను బీఏసీలో చర్చించారు. వచ్చే నెల 4 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. ఐదు రోజులపాటు జరిగే ఈ సమావేశాల్లో 19 బిల్లులు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీఏసీ సమావేశానికి సీఎం జగన్మోహన్ రెడ్డి, సభా వ్యవహారాల మంత్రి బుగ్గన, విప్ శ్రీకాంత్ రెడ్డి, టీడీపీ శాసనసభా పక్ష ఉపనేత అచ్చన్నాయుడు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాలు కనీసం పది రోజుల పాటు నిర్వహించాలని టీడీపీ నేత అచ్చెన్నాయుడు బీఏసీలో డిమాండ్ చేశారు.












