వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, తిరుగుబాటు నాయకుడిగా ముద్రపడిన రఘురామక్రిష్ణ రాజుకు ముంబాయిలోని ఏషియన్ ఆస్పత్రిలో బైపాస్ సర్జరీ జరిగింది. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం కుదురుగానే ఉంది.
రఘురామక్రిష్ణ రాజు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపించడంలో ఎప్పుడూ ముందుంటారు. తమ పార్టీ చాలా మంచి ప్రజాసేవాభిలాషతోనే ఎన్నికల నాటికి ఉన్నదని, కానీ ఫలితాల తర్వాత ఏర్పడిన ప్రభుత్వం మాత్రం.. సరిగా పనిచేయడం లేదని.. ఆయన పదే పదే చెబుతుంటారు.
ప్రభుత్వంలో ఏ చిన్న లోపం దొర్లినా.. తక్షణం తన రచ్చబండ లైవ్ కార్యక్రమంలో ఉతికి ఆరేయడానికి ఆయన ఎన్నడూ వెనకాడరు. అలాంటి రఘురామరాజు ప్రస్తుతం ముంబాయి ఆస్పత్రిలో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. త్వరలోనే ఆయన కోలుకుని మామూలు పరిస్థితికి వస్తారని, ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.