బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఉత్కంఠగా సాగుతోంది. కప్పును డిసైడ్ చేసే నాలుగో టెస్టులో గెలుపు కోసం ఇరు జట్లూ శ్రమించాల్సి వస్తోంది. తొలిరోజు ఆసీస్ పైచేయి సాధించింది. రెండోరోజు ఆటలో భారత్ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. ఈలోపే.. వర్షం అడ్డంకిగా మారింది. టీ విరామం అనంతరం వర్షం ప్రారంభమైంది. ఫలితంగా మ్యాచ్ ను తాత్తాలికంగా వాయిదా వేశారు. వర్షం తగ్గకపోవడంతో చివరికి రెండోరోజు ఆటను రద్దు చేశారు.
ఇద్దరికిదే అరంగేట్రం.. వారికి అనుభవమే లేదు!
ఆసీస్ పర్యటనలో టీమిండియాను గాయాలు వెంటాడాయి. కరోనా వేధించింది. మరికొందరిది తప్పక సెలవు తీసుకోవాల్సిన పరిస్థితి! ఇటువంటి సమయంలో నాలుగో టెస్టు కీలకంగా మారింది. ఎలాగైనా గెలవాల్సిన అవసరం ఉంది. ఈక్రంలో ఇద్దరు బౌలర్లకు ఇదే అరంగేట్రం. మరో ముగ్గురికి కనీసం ఐదు టెస్ట్‌ల అనుభవం కూడాలేదు. అయితేనేం.. భళా అనిపించారు. తమదైన శైలిలో ఆసీస్ ను కట్టడి చేశారు. కొన్ని క్యాచ్ లు వదిలెయ్యడంతోపాటు మరికొన్ని తప్పులు చేయకుంటే.. అతితక్కువ స్కోరుకే ఆసీస్ ఆలౌట్ కావాల్సింది!
పుజారా, రెహానే నిలుస్తారా?
టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 60 పరుగులకే ఓపెనర్లు రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ వికెట్లను కోల్పోయింది. గిల్ ఏడు పరుగులకే ఔట్ కాగా, రోహిత్ శర్మ 74 బంతుల్లో 6 ఫోర్లతో 44 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. కమిన్స్ వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్ రెండో బంతికి గిల్ ఔట్ కాగా, లయన్ వేసిన 20 ఓవర్ ఐదో బంతికి రోహిత్ పెవిలియన్ చేరాడు. గిల్ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి పుజారా రాగా, రోహిత్ ఔటైన తర్వాత రహానే బ్యాటింగ్‌కు దిగాడు. వీరిద్దరూ మెల్లగా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళుతున్నారు. క్రీజ్‌లో పాతుకోవడానికి ప్రాధాన్యత ఇస్తూ ఆసీస్ బౌలర్లకు పరీక్షగా నిలిచారు. ఈ జోడి పరుగు సాధించడానికి 30 బంతులు తీసుకుంది. దాంతో వరుసగా నాలుగు మెయిడిన్లు పడ్డాయి.
369 పరుగులకు ఆసీస్ ఆలౌట్.. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 369 పరుగులకు ఆలౌటైంది. రెండో రోజు 274/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆటను ప్రారంభించిన ఆసీస్ 5 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది. శనివారం ఆటలో పైన్, కామెరూన్ గ్రీన్‌లు ఆకట్టుకున్నారు. వీరిద్దరూ కలిసి ఆరో వికెట్‌కు 111 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. భారీ స్కోర్ సాధించే దిశగా సాగుతున్న వీరి భాగాస్వామ్యాన్ని శార్దుల్ ఠాకుర్ విడదీశాడు. అర్ధశతకంతో దాటిగా ఆడుతున్న పైన్ శార్దుల్ బౌలింగ్‌లో స్లిప్‌లో రోహిత్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత కామెరూన్ గ్రీన్(47) వాషింగ్టన్ సుందర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. టెయిలెండర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు.