ఏపీలో జగన్ చేతుల మీదగా జీజీహెచ్ కేంద్రంలో కరోనా వ్యాక్సిన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇదే కేంద్రంలో రాధ అనే హెల్త్ వర్కర్ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది. టీకా వేయించుకున్న అనంతరం రాధ కళ్లు తిరిగి పడిపోయినట్లు తెలుస్తుంది. వెంటనే స్పందించిన వైద్య బృందం ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఆమె అస్వస్థకు కారణం టీకానా లేదా వేరే ఆరోగ్య సమస్యలా అనే విషయం తెలియాల్సి ఉంది.
వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కొద్దిపాటి సైడ్ ఎఫెక్స్ ఉంటాయని ముందుగానే కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. వ్యాక్సిన్ వేయించుకున్న ప్రాంతంలో దురద, మంట, వాపు లాంటివి రావడం. జ్వరం, తలనొప్పి, వికారం, కళ్లు తిరగడం వంటివి తలెత్తే అవకాశాలు ఉన్నాయని ముందే తెలియజేసింది. కాబట్టి ప్రతి కేంద్రంలో వైద్య సహాయం అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు సూచించింది కేంద్రం. ఏపీలో పలు చోట్ల కోవిన్ యాప్స్ మొరాయింపుతో డేటా అందక వ్యాక్సినేషన్ మొదలవలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. జగన్ మొదలుపెట్టిన విజయవాడ నగరంలోనే పలు చోట్ల ఇలాంటి సాంకేతిక లోపాలు ఉన్నట్లు తెలియవచ్చింది.
https://www.youtube.com/watch?v=jt9t3rA-BqY











