అక్కినేని అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. గీతా సంస్థలో నిర్మాణం జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతికి రావాలి కానీ.. కొన్ని కారణాల వలన కుదరలేదు. సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో సినిమాను ఎనౌన్స్ చేయడం జరిగింది.
భారీ యాక్షన్ మూవీగా రూపొందనున్న ఈ సినిమాని జనవరి నుంచి స్టార్ట్ చేయాలి అనుకున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. త్వరలోనే ఈ మూవీని ఎప్పటి నుంచి ప్రారంభించనున్నారు అఫిషియల్ గా ఎనౌన్స్ చేయనున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు అఖిల్ మరో సినిమాకి ఓకే చెప్పారని తెలిసింది. ఇంతకీ ఎవరితో అంటారా.? ఫ‌్యామిలీమేన్ వెబ్ సిరీస్ బాలీవుడ్ లో బాగా సక్సస్ అయ్యింది.
ఈ వెబ్ సిరీస్ ను రాజ్ – డికె డైరెక్టర్ చేశారు. వీళ్లు తెలుగువారే. రాజ్ నిడిమూరు, కృష్ణ డికె. గతంలో డి ఫర్ దోపిడి అనే తెలుగు సినిమా చేశారు. ఇప్పుడు అఖిల్ తో యాక్షన్ మూవీ చేయబోతున్నారని తెలిసింది. ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్ లో అశ్వనీదత్ నిర్మించనున్నారని సమాచారం. ఇంతకీ.. ఈ ప్రాజెక్ట్ ను ఎవరు సెట్ చేశారంటే.. సమంత అని తెలిసింది. ఫ్యామిలీమేన్ వెబ్ సిరీస్ లో సమంత టెర్రరిస్ట్ గా నటించింది. అఖిల్ లైన్ అప్ బాగుంది. మరి.. ఇక నుంచైనా సక్సస్ సాధించి కెరీర్ లో మాంచి ఊపు వస్తుందేమో చూడాలి.











