ఈ మధ్యనే బల్లాలదేవుడు రానా ఒక ఇంటివాడు అయిన సంగతి తెలిసిందే. ఈవెంట్ ప్లానింగ్ బిజినెస్ గాళ్ మిహిక బజాజ్ ను పెళ్ళి చేసుకున్నాడు. అయితే అంతలోనే ఒక షో లో తన ఆరోగ్యం పట్ల సంచలన విషయాలు చెప్పి అందరికీ షాకిచ్చాడు రానా. తెలుగు ఓటీటీ ఆహాలో సమంత హోస్ట్ గా ‘సామ్ జామ్‘ అనే పేరుతో ఓ వెబ్ ప్రోగ్రామ్ రన్ అవుతున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ ఎపిసోడ్ లో దీనికి అతిధిగా రానా విచ్చేశాడు. మొదట సమంత అడిగిన ప్రశ్నలకు చాలా సరదాగా సమాధానాలు చెప్పిన రానా, ఆ తర్వాత తన ఆరోగ్యంపై చేదు వార్తలు చెప్పాడు.
తాను పుట్టినప్పటి నుంచి బీపీ ఉందని, అందువలన గుండెకు సమస్య తలెత్తుతుందని రానా తెలిపాడు. బీపీ వలన తన కిడ్నీలు కూడా పాడవుతాయని డాక్టర్లు ఇప్పటికే స్పష్టం చేశారని తెలిపాడు. తనకున్న బీపీ వలన మెదడులో నరాలు చిట్లిపోవడం 70శాతం, మరణించడం 30శాతం అవకాశం ఉంటుందని డాక్టర్లు తెలిపారని చెబుతూ రానా ఉద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నాడు. ఈ విషయాలు విన్న సమంత కూడా కంటతడి పెట్టుకుంది. ఆ ప్రాగ్రాం చుసిన ప్రేక్షకులు కూడా కన్నీరు పెట్టుకున్నారు. ఇప్పటివరకు ఈ విషయాలను తను ఎవరికీ చెప్పలేదని రానా తెలిపాడు.
దీంతో రానా అభిమానులు తమ హీరో కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు. చాలా చిలిపిగా కనపడే రానా వెనకాల ఇంత దుఃఖం ఉందా అని సినీ ప్రముఖులు సైతం నివ్వెరపోతున్నారు. ఇంతటి ఆరోగ్య సమస్య ఉన్నా రానా వరుస సినిమాలలో నటించడం చాలా గ్రేట్ అనే చెప్పాలి. కాగా రానా ప్రస్తుతం ‘విరాట పర్వం‘ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అలాగే తను నటించిన అరణ్య చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉంది.
Must Read ;- స్లిమ్.. జిమ్.. అంటే సమంతకు ఎంత హాటు ప్రేమయో?