దగ్గుబాటి రానా తాను ప్రేమించిన అమ్మాయి .. మిహికాను ఆగస్ట్ 8న వివాహం చేసుకొన్న సంగతి తెలిసిందే. కోవిడ్ 19 కారణంగా కేవలం అతి తక్కువ మంది బంధువులు, ఆహ్వానితుల సమక్షంలో మాత్రమే చాలా సింపుల్ గా జరిగిపోయింది వారి పెళ్ళి. లాక్ డౌన్ సడలించడంతో ప్రస్తుతం ఈ జంట హనీమూన్ ట్రిప్ లో ఉన్నట్టు తెలుస్తోంది.
తాజాగా ఇన్ స్టాలో మహికా బజాజ్ ఇన్ స్టాలో ఒక ఫోటోను షేర్ చేసింది. అందులో రానా, మహికా జంట.. సన్ బాత్ లో మునిగిపోయి .. హానీమూన్ ఎంజాయ్ మెంట్ లో ఉన్నట్టు క్లియర్ గా అర్ధమవుతోంది. బీచ్ ఒడ్డున రానా మహికా తీసుకొన్న ఓ సెల్ఫీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రానా రెడ్ కలర్ కాజువల్ స్లీవ్ లెస్ టీ షర్ట్ ధరించగా.. మిహికా.. కలర్ ఫుల్ టాప్ విత్ జీన్స్ లో దర్శనమిచ్చారు. నవ దంపతులిద్దరూ చిరునవ్వులు చిందిస్తూ.. తమ ఎంజాయ్ మెంట్ కు ఆకాశమే హద్దు అన్నట్టుగా కనిపిస్తున్నారు.