సన్నగా నాజూకుగా ఉండాలని సమంతకు ఎంతో కోరిక. అందుకే ఆమె దృష్టంతా స్లిమ్ మీదే పెడుతుంటుంది.. అందుకోసం జిమ్ ల్లో అడుగుపెట్టేస్తుంటుంది. దీని మీద ఆమెకు ఇంత హాటు ప్రేమ ఉన్నప్పడు.. కుర్రకారుకు ఇంకెంత హీటు హృదయముంటుంది చెప్పండి.
ఆమె సోషల్ మీడియోలో విడుదల చేసిన ఓ వీడియో తెగ వైరల్ అయిపోతోంది. urlife.co.in పేరుతో సమంత అక్కినేని, ఉపాసన కొణిదెల ఓ వెబ్ సైట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఫిట్నెస్.. ఆరోగ్యం .. ఆహారం తదితర అంశాల గురించి సమంతా చక్కటి తరగతులు నిర్వహిస్తోంది. అంతా బాగానే ఉంది కానీ సమంత అంతలా వాటిని చూపించాల్సిన అవసరముందా అంటున్నవారూ ఉన్నారు. ఆమె తపనను అర్థం చేసుకోకపోవడం వల్లే ఈ తలనొప్పంతా. లాక్ డౌన్ టైమ్ లో వంట చేయడాన్ని అందరం చూశాం.. ఆ తర్వాత రూఫ్ టాప్ పై తోట పని.. వాటితో పాటు ఆమె జిమ్ లో దూరితే ఇక అంతే సంగతులు.
కష్టంగా ఉండే కసరత్తులను కూడా చాలా ఈజీగా చేసేస్తుంటుంది ఈ బేబీ. ఆమె ఇన్ స్టా గ్రామ్ చూస్తే ఆమె శ్రమ వెయ్యిగ్రాముల పైచిలుకే కనపిస్తుంది. ఇంతచేస్తే ఆమె ఇంకెన్నిగ్రాములు తగ్గిందో ఆమెకే తెలియాలి. కానీ సన్నగా నాజూకుగా మాత్రం కనిపించేస్తోంది. ఇప్పుడు ఇల్లే ఆమెకు జిమ్ గా మారిపోయిందట. అత్తగారు అమల కూడా ఆ సన్నదనాన్ని చక్కగా మెయింటెయిన్ చేస్తుంటుంది. సమంతకు ఇషా క్రియా విధానం కూడా ఈమధ్య అలవడింది.
దీని గురించి ఆమె ఇలా పేర్కొన్నారు ‘నా ఇషా క్రియా యోగ ప్రయాణం ప్రారంభమైంది. ఇది 48 రోజుల ప్రయాణం. మీరు కూడా నాతో చేరాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా’ అంటుంటే ఇక ఎవరు మాత్రం ఆగుతారు. ఆమెతో చేరాలంటే ఆమె జిమ్ కు వెళ్లమని కాదు. మీరూ ఆమెలా చేయాలని ఆమె కోరుకుంటోంది. ఈ క్రియ యోగం మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందట. మన కష్టాన్ని ఎదుర్కోడానికి ఇదో సాధనం అని కూడా ఆమె అంటోంది. మరి మనం కూడా ఓ ప్రయత్నం చేసేస్తే పోలా.. అదే ఇషా క్రియాయోగ సాధన.












