మంచు విష్ణు, శ్రీనువైట్ల కలయికలో రూపొందిన బ్లాక్ బస్టర్ ఎంటర్ టైనర్ ‘ఢీ’. విష్ణు కెరీర్ లోనే టాప్ గ్రాస్ కలెక్షన్ చేసిన సినిమా ఇది. అలాగే కామెడీ ఎంటర్ టైనర్స్ తీయడంలో సిద్ధహస్తుడనిపించుకున్న శ్రీను వైట్ల ఈ మూవీతోనే దానికి శ్రీకారం చుట్టాడు. బ్రహ్మానందం, సునీల్ కామెడీ ట్రాక్ ఈ సినిమాను ఎక్కడికో తీసుకెళ్ళింది. పదమూడేళ్ళ క్రితం విడుదలైన ఈ సినిమాకు సీక్వెల్ రూపొందించాలని శ్రీను వైట్ల ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. అలాగే విష్ణుకీ చాలా ఆసక్తి.
ఎట్టకేలకు ఇన్నాళ్ళకు వారిద్దరి కోరిక తీరింది. ‘ఢీ’ సినిమాకి సీక్వెల్ రూపొందబోతోంది. సినిమా పేరు ‘డి అండ్ డి’. డబుల్ డోస్ అనే ట్యాగ్ లైన్ తో సినిమా రూపొందనుంది. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ 23న రానుందని .. శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందనుందని, అలాగే.. దానికి ఢీ మూవీతో కూడా లింక్ ఉంటుందని ఒక క్లూ ఇచ్చాడు విష్ణు. సరిగ్గా ఈ రోజు మంచు విష్ణు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ను సోషల్ మీడియాలో రివీల్ చేశారు. ‘డి అండ్ డి’ టైటిల్ లోగో చాలా ఆకర్షణీయంగా ఉంది. రెండు బేడీల్లో డి అండ్ డి లెటర్స్ రిలీల్ అయ్యాయి.
టైటిల్ ను బట్టి .. ఇది ఇద్దరు క్రిమినల్స్ కు సంబంధించిన కథ అని అర్ధమవుతోంది. అలాగే ఆ ఇద్దరు ఛీటర్స్ అని తెలుస్తోంది. సరిగ్గా ఢీ సినిమాలో విష్ణు అదే పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో మంచు విష్ణుతో పాటు నటించబోయే మరో క్రిమినల్ ఎవరై ఉంటారు అనే క్యూరియాసిటీ ఉంది. అయితే ఇందులో విష్ణునే రెండు పాత్రలు పోషిస్తాడని కూడా వార్తలొస్తున్నాయి. మరి ఒక నిజంగానే విష్ణు ద్విపాత్రాభినయం చేస్తాడో లేదో తెలియాలంటే.. కొద్ది రోజులు ఆగాల్సిందే.
Must Read ;- మళ్ళీ ‘ఢీ’ కొట్టనున్న సూపర్ హిట్ కాంబో











