Balineni Srinivasareddy Says All Ministers In AP Cabinet Should Be Sacked :
అదేంటో గానీ.. జగన్ మామ గారు, ఏపీ కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి నోట నుంచి ఇటీవలి కాలంలో అన్నీ సంచలన వ్యాఖ్యలే వినిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న ప్రైవేట్ జెట్ లో డాబూ దర్పాన్ని ఒలకబోస్తూ రష్యా టూర్ కు వెళ్లిన బాలినేని.. విమానంలో లగ్జరీ స్టైల్లో తన సెల్ఫీ తీసుకుని దానిని తానే స్వయంగా సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసి పెను వివాదంలో చిక్కుకున్నారు. ఈ విమర్శలపై టూర్ నుంచి తిరిగివచ్చాక తనదైన స్టైల్లో ఎదురు దాడికి దిగిన బాలినేని.. తన మిత్రులతో కలిసి ప్రైవేట్ టూర్ కు వెళితే తప్పేంటి అంటూ ప్రశ్నించారు. ఈ వివాదాన్ని మరిచిపోక ముందే.. ఆయన నోట శనివారం మరో సంచలన కామెంట్ వచ్చింది. ప్రస్తుతం జగన్ కేబినెట్ లో ఉన్న మంత్రులందరూ.. చివరకు తనతో సహా మాజీలు అవుతున్నారని, మొత్తం మంత్రివర్గాన్ని సమూలంగా మార్చేస్తున్నారని బాలినేని సంచలన వ్యాఖ్య చేశారు.
బాలినేని ఏమన్నారంటే..?
సందర్భం ఏమిటో తెలియదు గానీ.. శనివారం నాడు మంత్రి బాలినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. అది కూడా కేబినెట్ పునర్వవస్థీకరణకు సంబంధించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా బాలినేని ఏమన్నారంటే.. ‘‘ఏపీ మంత్రివర్గంలో త్వరలోనే భారీ మార్పులుంటాయి. మంత్రివర్గంలో వందశాతం కొత్తవారిని తీసుకుంటామని సీఎం జగన్ చెప్పారు. విధాన నిర్ణయానికి కట్టుబడి ఉంటా. ఇదే మాటను సీఎం జగన్‌కు ఇప్పటికే చెప్పేశాను. మంత్రి పదవి పోయినా నేను భయపడను. నాకు పార్టీ ముఖ్యం. పదవులు కాదు’’ అని బాలినేని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఊస్టింగ్ మాట చెప్పేశారా?
బాలినేని వ్యాఖ్యలు చూస్తుంటే.. ఇటీవల రష్యా టూర్ వివాదం నేపథ్యంలో బాలినేనిని మంత్రివర్గం నుంచి తప్పించేందుకు జగన్ సిద్ధపడిపోయినట్లుగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని స్వయంగా బాలినేనిని పిలిపించి మరీ జగన్ చెప్పేసినట్లుగా తెలుస్తోంది. ఎలాగూ రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గ పునర్వవస్థీకరణ తప్పదని చెప్పాం కదా.. అందులో భాగంగానే మంత్రివర్గాన్ని పూర్తిగా మార్చేస్తానని, అందులో మీ పదవి కూడా ఊస్టింగేనని జగన్ స్వయంగా బాలినేనికి చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక పదవి ఊడేదాకా సైలెంట్ గా ఉండేకంటే..ముందుగానే చెప్పేస్తే పోతుంది కదా.. కనీసం పరువు అయినా దక్కుతుంది అన్న కోణంలో ఆలోచించిన బాలినేనిన.. ఏ ఒక్కరూ అడగకుండానే.. మంత్రివర్గ పునర్వవస్థీకరణ తప్పదని, అందులో తన పదవి కూడా ఊడిపోతుందని చెప్పేశారన్న దిశగా ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి.
Must Read ;- ఎమ్మెల్యే రోజా డమ్మీ అయిపోయారే











