వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పై సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ట్వీట్ లతో విరుచుకుపడ్డారు. విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్ కు పట్టిన పెద్ద దరిద్రం అని ధ్వజమెత్తారు. చంద్రబాబు పై కోపం ఉంటే ఆయన్ని తిట్టాలి కానీ కులాన్ని కాదని, వ్యక్తి మీద గొడవతో కులం మీద దూషణ చేస్తే జనం చెప్పుదెబ్బ రుచి చూపిస్తారని బండ్ల గణేష్ పేర్కొన్నారు.మీకు కులం నచ్చకుంటే..కమ్మ వాళ్ళు నచ్చకుంటే నేరుగా తిట్టండి కానీ చంద్రబాబును టిడిపి ని అడ్డం పెట్టుకుని కమ్మవారిని తిట్టడం ఏమిటని ఆగ్రహం వ్యక్తంచేశారు. కులాల విషయంలో ఎలా వ్యవహరించాలి కేసీఆర్ ని చూసి నేర్చుకోవాలని చురకలు అంటించారు. విజయసాయిరెడ్డి బ్రతుకు ఎక్కడ మొదలైందో తనకు తెలుసన్న బండ్ల, ఎంపీ అయినంత మాత్రాన కళ్ళు నెత్తికెక్కాయి అంటూ మండిపడ్డారు.వ్యక్తి నచ్చకుంటే పేరు పెట్టి తిట్టాలి కానీ కులాన్ని కాదన్న ఆయన విజయసాయిరెడ్డిని జైలుకు పంపింది కమ్మ వారు కాదని ట్వీట్ లో పేర్కొన్నారు.ఇక త్వరలో జగన్ కు వెన్నుపోటు పొడిచే దరిద్రుడు విజయసాయిరెడ్డి అని.. ఈ ట్వీట్ తర్వాత తనను ఎంతో ఇబ్బంది పెడతాడని తెలిసినా అన్నీ తెగించి ఈ ట్వీట్ చేస్తున్నానని బండ్ల గణేష్ తెలిపారు.
బాలయ్యతో మరోసారి జతకట్టనున్న ప్రియమణి
బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే....