నిద్ర సరిగా లేక ఇబ్బందిపడుతున్నారా? అయితే కాళ్లకు సాక్సులు వేసుకోండి.. చక్కగా నిద్ర పట్టే అవకాశాలు ఉన్నాయి. నిద్రకి.. కాళ్లకి.. సాక్సులకి.. అసలు సంబంధం ఏంటి అనుకుంటున్నారా? చాలా ఉందంటున్నారు ఆరోగ్య నిపుణలు. రాత్రి నిద్రించే సమయంలో సాక్సులు వేసుకుని నిద్రించడం వల్ల నిద్రలేమికి చెక్ పెట్టవచ్చంట. హాయిగా నిద్రిస్తే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో వేరే చెప్పాలా..
- చలి వల్ల ఇబ్బందిపడుతున్న సందర్భంలో కాళ్లకు సాక్సులు వేసుకుని నిద్రిస్తే హాయిగా నిద్రించవచ్చు. కాళ్లకు సాక్సులు వేసుకుంటే ఉష్ణోగ్రతలు నియంత్రించబడి చలి తగ్గుతుంది. అందువల్ల చక్కగా నిద్రపడుతుందట.

- అంతేనా.. రక్తప్రసరణలో మార్పులు ఉంటాయట సాక్సుల వేసుకుని నిద్రిస్తే. అదెలా అనుకుంటున్నారా? సాక్సులు వేసుకోవడం రక్తనాళాలు కాస్త వదులవుతాయి. ఈ ప్రక్రియ వల్ల రక్త ప్రసరణ ఎటువంటి ఆటంకం లేకుండా సజావుగా జరుగుతుందట. ఇలా కాళ్ల ఆరోగ్యాన్ని కాపాడవచ్చని సలహా ఇస్తున్నారు నిపుణులు.
- పాదాలకు మాయిశ్చరైజర్ రాసుకుని సాక్స్ వేసుకుని పడుకోవడం వల్ల కాళ్ల పగుళ్లును నివారించవచ్చు. దీని వల్ల కాళ్లు ఆరోగ్యంగా ఉండడంతోపాటు.. అందంగా మెరిసిపోతాయంటున్నారు నిపుణులు.
- కానీ, సాక్సులు ధరించడంలో కూడా కొన్ని జాగ్రత్తులు పాటించాలంటున్నారు. నిరంతరం సాక్సులు ధరించడం కూడా మంచిది కాదు. కాళ్లకు గాలి తగలడం చాలా అవసరం. అలాగే సాక్సులు కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి లేదా కాళ్లలో మురికి చేరే అవకాశాలు ఉంటాయి.
- సాక్సులు తొలగించిన మీదట పాదాలను శుభ్రం చేసుకోవడం మరిచిపోకండి. దీని వల్ల మురికి తొలిగి కాళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
కాళ్లే కదా ఏముందిలే అనుకుంటారు చాలా మంది. కానీ చూశారా.. నిద్రకి.. పాదాలకు ఎంత సంబంధం ఉందో.. కాబట్టి ఇకపై పాదాల ఆరోగ్యం.. అందం గురించి కూడా కాస్త ఆలోచించండి.. హాయిగా నిద్రపోండి..











