మూడో మంత్రి ధరమ్ సింగ్ సైనీ రాజీనామా!
దేశ చరిత్రలో కేబినెట్ మంత్రులు కూడపలుక్కొని ఇలా రాజీనామాలు చేసి, బయటకు రావడం ఎక్కడ చూడలేదు. అది ఎన్నికలకు నెల రోజులు ముందు ఇటువంటి పరిణాలమాలు చోటు చేసుకోవడం దేశ రాజకీయాల్లో అత్యంత అరుదు. యోగి ప్రభుత్వంపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత ఆ పార్టీ మొత్తంపై పడేనట్లు కనిపిస్తోంది. ప్రజల్లో, పార్టీలో ఒక స్థాయిలో వస్తున్న వ్యతిరేకత కారణంగానే ఇలా మంత్రులు, ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా రాజీనామాలు చేసి వేరే గూటిన వెతుకుంటారన్న చర్చా.. యూపీ విధుల్లో రచ్చ చేస్తోంది. ఇదిలా ఉంటే యూపి ప్రభుత్వం నుంచి మొన్న కార్మిక శాఖ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య, నిన్న అటవీశాఖ మంత్రి దారసింగ్ చౌహన్, నేడు ఆయుష్, ఆహార భద్రత, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా ధరమ్ సింగ్ సైనీలు, ఎమ్మెల్యే ముఖేష్ వర్మలు రాజీనామా చేసి వైదోలిగారు.
బడుగులపై సాగుతున్న అణచివేత కారణంగానే రాజీనామాలు
ఇప్పటికే ఉత్తరప్రదేశ్ లోని అధికార బీజేపీ నుంచి 9 మంది ఎమ్మెల్యే, ముగ్గురు మంత్రలు బయటకొచ్చారు. పార్టీకి గుడ్ బై చెప్పిన ప్రతి ఒక్కరూ.. యోగి ప్రభుత్వ వైఫల్యలాను ఎండగట్టేందుకు పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. దళితులు, ఇతర వెనుకబడిన తరగతులు, మైనారిటీ వర్గాలు, రైతులు, నిరుద్యోగుల పట్ల యోగి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. అలానే ఐదేళ్ల పాలనలో దళిత, వెనుకబడిన, మైనారిటీ వర్గాల నాయకులను, ప్రజాప్రతినిధులను పట్టించుకోదన్న ఆరోపణలు కూడా లేకపోలేదు. ఎన్నికల వేళ నేతలు పార్టీలు మారడం కలమంలో కలవరం మొదలైంది. గెలిచి మరోసారి యూపీ పీఠాన్ని దక్కించుకోవాలని చూస్తున్న బీజేపీకి, సొంత పార్టీ ముఖ్యనేతలే రాజీనామాలు చేస్తూ.. ఇలా షాకుల పై షాకులిస్తున్నారు.











