వివేకా కేసు గత 2 సంవత్సరాలలో ఎటువంటి పురోగతిని నమోదు చేయలేదని, అది CID లేదా CBI వద్ద ఉన్నప్పటికీ, స్వయంగా CM వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పై బలమైన నేరారోపణ ఉంది. ఇదంతా జగన్ సమక్షంలోనే జరిగిందనేది ఓపెన్ సీక్రెట్. తన స్వార్థం కోసం, సొంత ప్రయోజనాలకోసమే వివేకానంద రెడ్డి హత్య చేయబడ్డాడు అనే అభియోగం ఉంది.
ఇదిలా ఉంటె సిబిఐ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వై ఎస్ భారతి కి ఎవ్వరు ఊహించని విధంగా సిబిఐ నోటీసులు జారీచేసింది. ఇపుడు ఇదే ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో పెను సంచలనంగా మారింది. మహోన్నతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ ఇలాంటి నేరారోపణలు జగన్ చుట్టుముట్టడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తుతున్నాయి.
మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ CBI జూన్ 30న సమర్పించిన చార్జిషీట్‌లో కీలక సాక్షుల వివరాలు, వారి వాంగ్మూలాలు వెల్లడయ్యాయి. సాక్ష్యుల్లో జగన్ ఓఎస్డీ పి కృష్ణమోహన్ రెడ్డి, రిటైర్డ్ సీఎస్ అజేయ కల్లం, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జగన్ సహాయకుడు గోపరాజు నవీన్ కుమార్ ఉన్నారని సీబీఐ పేర్కొంది. కేసుకు సంబంధించి వారు తమ వాంగ్మూలాలను ఇచ్చారు. వివేకా హత్యకు గురైన రోజు మార్చి 15, 2019న హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన మేనిఫెస్టోపై చర్చించేందుకు సమావేశమైనట్లు సీబీఐ పేర్కొంది.
పి.కృష్ణమోహన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, వైఎస్ జగన్‌తో భేటీ సందర్భంగా ఆయన సహాయకుడు నవీన్ తనను బయటకు పిలిచి ఎంపీ అవినాష్‌రెడ్డి లైన్‌లో ఉన్నారని ఫోన్‌ను అందజేశారని తెలిపారు. వైఎస్ వివేకానందరెడ్డి మృతదేహం బాత్‌రూమ్‌లో రక్తపు మడుగులో ఉందని అవినాష్‌రెడ్డి తనకు తెలియజేశారని, పరిస్థితిని జగన్‌కు తెలియజేయాలని కృష్ణమోహన్‌రెడ్డిని కోరినట్లు తెలిపారు.
హత్య జరిగిన రోజు తెల్లవారుజామున 5.30 గంటలకు లోటస్ పాండ్‌లో ఉన్నప్పుడు వైఎస్ జగన్‌ను భారతి అటెండర్ ద్వారా పైకి పిలిపించారని, 10 నిమిషాల తర్వాత వైఎస్ జగన్ బయటకు వచ్చి వైఎస్ వివేకానందరెడ్డి మృతి గురించి తెలియజేశారని మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం తెలిపారు.