ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సమయం రానే వచ్చింది. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలకు సంబంధించిన కౌంటింగ్ జరుగుతోంది. మొత్తం 23 రౌండ్లలో కౌంటింగ్ జరగాల్సి ఉంటుంది. ఇప్పటికీ ఐదు రౌండ్లు పూర్తయ్యాయి. 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. 11 గంటల ప్రాంతం వరకు ఐదు రౌండ్ల ఫలితాలు వెలువడ్డాయి. ఈ 5 రౌండ్లలోనూ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావే మొదటి నుంచి ఆధిక్యత కనబరుస్తున్నారు. మొదటి రౌండ్, రెండవ రౌండ్, మూడవ రౌండ్, నాల్గవ రౌండ్, ఐదవ రౌండ్ ఇలా ఒక్కొక్క రౌండ్ ఫలితాల్లో టీఆర్ఎస్‌పై పూర్తి ఆధిక్యతను బీజేపీ పార్టీ కనబరుస్తు వస్తోంది.
దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, బీజేపీ నుంచి రఘునందన్‌రావు, కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్ రెడ్డి బరిలో నిలిచారు. అయితే ముందస్తు అంచనాల ప్రకారం ప్రధాన పోటీ టీఆర్ఎస్, బీజేపీ మధ్యనే నడుస్తోంది. ఆ రెండు పార్టీలు హోరా హోరిగా తలపడుతున్నాయి. మొదటి రౌండ్ నుంచి బీజేపీ తన ఆధిక్యం కనబరుస్తూ వస్తుంది. ఇప్పటి వరకు బీజేపీకి 16,517 ఓట్లు, టీఆర్ఎస్‌కు 13497, కాంగ్రెస్ పార్టీకి 2724 ఓట్లు పోలయ్యాయి. 5 వ రౌండ్ ముగిసే సరికి బీజేపీ 3020 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉంది. ప్రస్తుతం దుబ్బాక మండలం ఓట్లను ముందస్తుగా లెక్కిస్తున్నారు. అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు దాదాపు 1500 ఓట్లు ఉంటే అందులో టీఆర్ఎస్ ఆధిక్యాన్ని కనబరిచింది. మొత్తం 23 రౌండ్లలో కౌంటింగ్ జరగాల్సి ఉంటుంది.ఇప్పటికీ ఐదు రౌండ్లు పూర్తయ్యాయి. ఇంకా గంట, రెండు గంటలు గడిస్తే గానీ పూర్తి అంచనాకు రాలేము.