దుబ్బాకలో భారతీయ జనతా పార్టీ విజయపథంలో ఉంది. అయితే ఇంత సానుకూల ఫలి తాలను పార్టీ పెద్దలు కూడా ఊహించలేదని అర్థమవుతోంది.
దుబ్బాక ఉప ఎన్నికల పై రాం మాధవ్ ట్విట్ చేశారు. ఆసక్తికరంగా దుబ్బక ఉప ఎన్నిక ఉన్నదని వ్యాఖ్యానించారు.
ఆశ్చర్యకరంగా ఆధిక్యం లో బీజేపీ అని రామ్ మాధవ్ పేర్కొన్నారు.
ఈమాటలను గమనిస్తే బీజేపీ పెద్దలు కూడా రఘునందన్ రావు గెలుపును ఊహించలేదని అర్థమవుతోంది. దుబ్బాక ఎన్నికల ఫలితాలపై రాంమాధవ్ వరుస ట్వీట్లు చేస్తున్నారు.
దుబ్బాకలో ఆసక్తికరమైన ఫైట్ నడుస్తోందని, భాజపాకు ఇది ఆశ్చర్యకరమైన విజయం అవుతందని ఒకసారి.. పడిన కష్టానికి ఫలితం కనిపిస్తోందని ఒకసారి.. మెజారిటీ కొనసాగుతున్నదని మరోసారి.. ఇలా ప్రతి రౌండ్ విజయానికి ఒకసారి రాంమాధవ్ ట్వీట్లు చేస్తున్నారు.