ప్రముఖ బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గణ్ సోదరుడు అనిల్ దేవ్ గణ్ నిన్న రాత్రి గుండెపోటుతో మృతి చెందారు.. రీసెంట్ గా అజయ్ ట్విట్టర్ పేజ్ లో ఈ విషయాన్ని తెలియజేశారు. నిన్నరాత్రి నా సోదరుడు అనిల్ దేవ్ గణ్ మమ్మల్ని విడిచి వెళ్ళిపోయాడు. అతడి హఠాన్మరణాన్ని మా కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది. అతడి ఎడబాటు నిజంగా నాకు తీరని వేదన కలిగిస్తోంది. ఈ సందర్భంగా అతడి ఆత్మ కు శాంతికలగాలని ప్రార్థిస్తున్నాను. కరోనా కారణంగా అతడి సంతాప ప్రార్ధన సభను ఏర్పాటు చేయలేకపోతున్నాం.. అంటూ అజయ్ దేవ్ గణ్ తన ఆవేదనను వ్యక్తం చేశారు.
అనిల్ దేవ్ గణ్ బాలీవుడ్ లో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ‘రాజు చాచా, బ్లాక్ మెయిల్, హాల్ – ఏ –దిల్’ సినిమాలతో అతడి పేరు మారుమోగింది. అందులో రాజు చాచా, బ్లాక్ మెయిల్ చిత్రాలు అన్న అజయ్ దేవ్ గణ్ తోనే తెరెకెక్కించడం విశేషం. అలాగే సన్నాఫ్ సర్దార్ సినిమాకి క్రియేటివ్ డైరెక్టర్ గా కూడా వ్యవహరించాడు. అనిల్ దేవ్ గణ్ మృతికి బాలీవుడ్ ప్రముఖులు తమ సంతాపాన్ని ప్రకటించారు.
I lost my brother Anil Devgan last night. His untimely demise has left our family heartbroken. ADFF & I will miss his presence dearly. Pray for his soul. Due to the pandemic, we will not have a personal prayer meet🙏 pic.twitter.com/9tti0GX25S
— Ajay Devgn (@ajaydevgn) October 6, 2020











