అలియా భట్ అందం.. మమూలుగానే అగ్గిరాజేస్తూ ఉంటుంది . అదే అందాలు ఆరబోసినప్పుడు మాత్రం ఆమె అగ్నిపర్వతమే. మంచుకొండల పక్కన ఈ అమ్మాయిని కాసేపు అలా నిలబెడితేచాలు, అవన్నీ వెన్నలా కరిగిపోవడానికి ఎక్కువసేపు పట్టదేమో. హాటుగా .. హీటుగా ఉండటం వల్లనే అనుకుంటా ఈ అమ్మాయికి బాలీవుడ్లో బోలెడంత క్రేజ్ ఉంది. అందుకే ఈ పిల్లను వరుస అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి.

ఒక వైపున బాలీవుడ్లో సంజాయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో అలియా ‘గంగూబాయి’ సినిమా చేస్తోంది. నాయిక ప్రాధాన్యత కలిగిన ఈ కథ అలియా చుట్టూనే తిరుగుతుంది. ఈ సినిమాతో ఈ అమ్మాయి క్రేజ్ మరో స్థాయిలో దూసుకెళుతుంది అంటున్నారు. ఇక తెలుగులో ఈ పిల్ల రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ ఆర్ ఆర్’లో చేస్తోంది. ఈ రెండు సినిమాలు కూడా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అందువలన ఈ ఏడాది ఈ అమ్మడికి ప్రత్యేకమైనదేనని అంటున్నారు.
రీసెంట్ గా ‘గంగూబాయి’ సినిమాకి బ్రేక్ ఇవ్వడంతో ఈ అమ్మాయి తన స్నేహితురాళ్లతో కలిసి షికారుకు వెళ్లింది. అందం విషయంలో .. వాటిని ఆరబోసే విషయంలో అందగత్తెల అభిరుచులు కలిస్తే ఎలా ఉంటుందనేది చూపించారు. అంతా కలిసి బికినీలతో బీచ్ కి కొత్త కళను తీసుకొచ్చే పనిలో పడ్డారు. పదునైన పరువాలతో కూడిన ఆ ఫొటోలను సోషల్ మీడియాలో వదిలారు .. అవి రాకెట్ లాంచర్ల స్థాయిలో దూసుకుపోతున్నాయి. తమ అందచందాల ప్రదర్శనకి ఆకాశమే హద్దు అన్నట్టుగా అలియా సంకేతాలు ఇస్తోంది. ఇన్ని అందాలు ఒక్కసారిగా ఒలకబోస్తే ఎత్తుకోవడానికీ .. మనసుకు మెత్తుకోవడానికి చాలా సమయమే పడుతుందే.











