ఏపీలో సంచలనం రేపిన డాక్టర్ సుధాకర్ కేసు విచారణ ఇవాళ హైకోర్టులో జరిగింది. ఈ నేపథ్యంలో సీబీఐ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో కుట్రకోణం దాగుందని లోతుగా విచారణ జరిపేందుకు సమయం కావాలని కోరింది. దీంతో ఏపీ హైకోర్టు సీబీఐకి రెండు నెలల గడువు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. నవంబర్ 11 లోగా నివేదిక సమర్పించాలని హైకోర్టు సిబిఐని ఆదేశించిన కోర్టు తదుపరి విచారణను నవంబర్ 16 కి వాయిదా వేసింది.
ఏప్రిల్ 8 న నర్సిపట్నం ఏరియా ఆసుపత్రిలో వైద్యులకు పిపిఇల కొరతను ప్రశ్నించినందుకు డాక్టర్ సుధాకర్ ను జగన్ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో ప్రభుత్వ తీరుపై విపక్షాలు మండిపడ్డారు. ఆ తరువాత సుధాకర్ మే 16న వైజాగ్ లో ప్రత్యక్షమయ్యారు. విధులకు ఆటంకం కలిగించారంటూ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. పోలీసులు సుధాకర్‌ను కొట్టే దృశ్యాలు న్యూస్ ఛానల్స్ ద్వారా ప్రసారం కావడంతో మే 22 న సిబిఐ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశించింది. సుధాకర్ పై పోలీసులు వ్యవహరించిన తీరుపై వీడియోలతో ఏపీ టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత హైకోర్టుకు లేఖ రాశారు. దీంతో కోర్టు ఈ లేఖను సుమోటో పిల్‌గా పరిగణించి విచారణ జరిపింది.ఫిర్యాదు ఆధారంగా పోలీసు సిబ్బంది, సుధాకర్‌లపై సిబిఐ కేసులు నమోదు చేసింది.
సుధాకర్ ఘటనలో సుప్రీం కుట్రకోణం ఉందని చెప్పడంపై టీడీపీ సీనియర్ నాయకుడు వర్ల రామయ్య సామాజిక మాధ్యమాల ద్వారా స్పందించాడు. “విశాఖ డా:సుధాకర్ ను పిచ్చి వాడుగా చిత్రీకరణ జరుగుతోందని మేము ఎంత మొర పెట్టుకొన్నా విన లేదు. ఇప్పుడు, సిబిఐ అందులో కుట్ర దాగి ఉందని హైకోర్టు కు చెప్పింది. ఇప్పటికైనా ప్రభుత్వం సిబిఐ దర్యాప్తు లో జోక్యం చేసుకోకుండా అసలు ముద్దాయి లు అరెస్ట్ అయ్యేలా చూడాలని డిమాండ్ చేస్తున్నాం” అంటూ ఆయన ట్వీట్ చేశాడు. హైకోర్ట్ అనుమతితో సీబీఐ తమ విచారణను వేగవంతం చేయనుంది.
విశాఖ డా:సుధాకర్ ను పిచ్చి వాడుగా చిత్రీకరణ జరుగుతోందని మేము ఎంత మొర పెట్టుకొన్నా విన లేదు. ఇప్పుడు, సిబిఐ అందులో కుట్ర దాగి ఉందని హైకోర్టు కు చెప్పింది. ఇప్పటికైనా ప్రభుత్వం సిబిఐ దర్యాప్తు లో జోక్యం చేసుకోకుండా అసలు ముద్దాయి లు అరెస్ట్ అయ్యేలా చూడాలని డిమాండ్ చేస్తూ న్నాo.
— Varla Ramaiah (@VarlaRamaiah) September 1, 2020











