ఆంధ్రప్రదేశ్‌లో నాడు – నేడుతో విద్యావ్యవస్థ రూపురేఖలు మార్చామని వైసీపీ గొప్పలు చెప్పుకుంటోంది. ఐతే వాస్తవాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం షాకింగ్ నిజాలు బయటపెట్టింది. గత ఐదేళ్లలో రాష్ట్రంలో 1000కిపైగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు తగ్గుముఖం పట్టాయని కేంద్రం స్పష్టం చేసింది. ఈ గణాంకాలు విద్యా వ్యవస్థను మెరుగుపరుస్తున్నామని చెప్పుకుంటున్న జగన్ పార్టీకి చెంపపెట్టు అనే చెప్పాలి.
కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది –
ఏపీలో గడిచిన ఐదేళ్ల కాలంలో 115 ప్రభుత్వ, 941 ప్రైవేట్ పాఠశాలలు తగ్గాయని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి రాజ్యసభలో స్పష్టం చేశారు. 2019-20లో 16 వేల 173గా ఉన్న ప్రైవేట్ స్కూళ్ల సంఖ్య 2023-24 నాటికి 15 వేల 232కు, ఇదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 43 వేల 115 నుంచి 43 వేలకు పడిపోయిందని చెప్పారు. ఐతే వైసీపీ హయాంలో నాడు – నేడు కింద పెద్ద ఎత్తున అవినీతి, అస్తవ్యస్త విధానాలతోనే రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్ల సంఖ్య పడిపోయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఐతే జగన్ పార్టీ తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి నారా లోకేష్‌పై బురద జల్లే ప్రయత్నం చేస్తోంది. ఇందుకు బ్లూ మీడియా సాక్షితో పాటు కొంతమంది అమ్ముడుపోయిన పేటీఎం జర్నలిస్టులు తప్పుడు లెక్కలతో ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను దాచిపెట్టి, లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ఎలాగైనా లోకేష్‌కు చెడ్డపేరు తెచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఐతే కేంద్రప్రభుత్వం తాజాగా ఇచ్చిన సమాధానం పేటీఎం జర్నలిస్టులకు చెప్పుదెబ్బ అనే చెప్పుకోవాలి.
కూటమి ప్రభుత్వం విద్యాశాఖపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. మంత్రి నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ప్రధానంగా వన్ క్లాస్ – వన్ టీచర్’ మోడల్ విధానాన్ని ప్రవేశపెడుతోంది. దీని ద్వారా ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉంటారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా 9,600 మోడల్ ప్రైమరీ పాఠశాలలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 700 అప్పర్ ప్రైమరీ పాఠశాలలను హైస్కూల్‌లుగా అప్‌గ్రేడ్ చేశారు. పాఠశాల ప్రాంగణంలో రాజకీయ కార్యక్రమాలను నిషేధించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మినహా ఇతరులకు పాఠశాల ప్రాంగణంలో ప్రవేశం లేకుండా చర్యలు తీసుకున్నారు. అంతే కాదు తల్లికి వందనం పేరుతో స్కూల్‌కు వెళ్లే పిల్లలకు రూ.15 వేల ఆర్థిక సాయం సైతం అందిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం “నాడు-నేడు” పేరుతో చేసిన పనులను సమీక్షించి, వాటిలో ఉన్న లోపాలను సరిదిద్దుతున్నారు. కేంద్రం నుండి అదనపు నిధులు తీసుకురావడంలో కూడా విజయం సాధించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో మళ్లీ ప్రభుత్వ పాఠశాలలు పూర్వవైభవాన్ని సంతరించుకుంటున్నాయి.











