లాస్టియర్ ‘మజిలీ, వెంకీమామ’ సినిమాలతో వరుస విజయాలు అందుకున్నాడు అక్కినేని నాగచైతన్య. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ లో నటిస్తున్నాడు. సాయిపల్లవి కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా విడుదల వాయిదా వేసుకుంది. ఈ మూవీ తర్వాత నాగచైతన్య .. పలు ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టుకున్నాడు. ఆ క్రమంలో విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు చైతు. గతంలో ఏఎన్నార్, నాగార్జున, చైతు తో ‘మనం’ సినిమా తీసి అక్కినేని ఫ్యామిలీకి మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చాడు విక్రమ్. ఇప్పుడు నాగచైతన్యతో ఒక వెరైటీ కాన్సెప్ట్ తో సినిమాకి రెడీ అవుతున్నాడు. దీనికి ‘థాంక్యూ’ అనే టైటిల్ రిజిస్టర్ చేసినట్టు సమాచారం.
‘థాంక్యూ’ కథ ప్రకారం ఈ సినిమాలో నాగచైతన్య మూడు వైవిధ్యమైన పాత్రలు పోషించబోతున్నాడట. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుందట. గతంలో నాగచైతన్య ‘ప్రేమమ్’ సినిమా కోసం ఈ తరహాలోనే మూడు పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. మూడు దశల్లో ముగ్గురు హీరోయిన్స్ తో ప్రేమలో పడే ఆ పాత్రను చైతూ తనదైన శైలిలో పోషించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ సినిమా యూత్ కు బాగా కనెక్ట్ అయింది. ఇక ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయి. ప్రస్తుతం కథానాయిక అన్వేషణలో ఉన్నాడు విక్రమ్ కుమార్. ఈ సారి నాగచైతన్య మూడు పాత్రల్ని ఏ రేంజ్ లో పోషించి మెప్పిస్తాడో చూడాలి.
‘ఖుషి’ 100 లక్కీ ఫ్యామిలీస్ లిస్ట్
"ఖుషి" సినిమాకు ఘన విజయాన్ని అందించిన అభిమానులతో తన సంతోషాన్ని పంచుకోవాలని ఉందని,...